Home » BJP Candidates
Andhrapradesh: ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు హుటాహుటిన హస్తినకు బయలుదేరి వెళ్లారు. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే పాడేరు, అనపర్తి, ఆదోనితో పాటు మరికొన్ని సీట్లపై కమలం పార్టీ అభ్యంతరం తెలుపుతున్నట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) కోసం బీజేపీ (BJP) ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన రెండు జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసింది. మొదటి జాబితాలో (BJP First List) 195 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత 74 మందితో కూడిన రెండో జాబితాను (BJP Second List) రిలీజ్ చేసింది. అయితే.. ఈసారి కొందరు సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టేసి, కొత్త వారికి అవకాశం కల్పించింది.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రెండవ జాబితాను భారతీయ జనతా పార్టీ బుధవారంనాడు ప్రకటించింది. 72 మందితో జాబితా విడుదల చేసింది. నితిన్ గడ్కరి, మనోహర్ లాల్ కట్టార్, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్, తేజస్వి సూర్య వంటి ప్రముఖులకు ఈ జాబితాలో చోటు దక్కింది.
బీజేపీ (BJP) ఇప్పటికే ఈ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాని (BJP First List) విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 195 మంది అభ్యర్థులతో కూడిన ఆ తొలి జాబితాలో తెలంగాణ నుంచి మొత్తం 9 మంది చోటు సంపాదించారు. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాని (BJP Second List) విడుదల చేసింది.
Andhra Pradesh Elections : విజయవాడలో బీజేపీ(BJP), జనసేన(Janasena) నేతల భేటీ ముగిసింది. గంటపాటు సాగిన ఈ సమావేశంలో.. పొత్తులో భాగంగా పార్టీలు పోటీ చేయనున్న స్థానాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఒడిస్సా ఎంపీ ఒబైజయంత్ పాండా, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్(Pawan Kalyan) పాల్గొన్నారు.
Lok Sabha Elections 2024: ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 370 సీట్లు లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది బీజేపీ(BJP). ఏ ఒక్క రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉంది పార్టీ అధిష్టానం. తాజాగా దక్షిది రాష్ట్రాలకు గేట్వేగా భావిస్తున్న తెలంగాణ(Telangana)పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కమలదళం. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరలేపింది.
బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దగ్గుబాటి పురందేశ్వరి భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికలలో వ్యూహాలపై చర్చించనున్నారు. నిన్న, మొన్న శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు కొనసాగుతోంది.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్ఠానం శనివారంనాడు విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు, 34 మందికి పైగా కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఈ జాబితాలో చోటుచేసుకున్నారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. 195 మంది అభ్యర్థులు మొదటి లిస్ట్‌లో చోటుచేసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. అమిత్‌షా గుజరాత్ గాంధీ నగర్ నుంచి, సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సుర స్వరాజ్ న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా నగరానికి చేరుకున్నారు. ఉప్పల్ ప్రాంతంలో ఆయన ఆటోలో ప్రయాణించారు.