Share News

BJP: అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేల డుమ్మా.. కారణమేంటంటే..?

ABN , First Publish Date - 2023-12-08T20:12:22+05:30 IST

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ( BJP Party ) తరఫున 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఈ ఎమ్మెల్యేలంతా రేపు (శనివారం) జరిగే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ( Akbaruddin Owaisi ) ఉంటే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ( Raja Singh ) ప్రకటించారు.

BJP: అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేల డుమ్మా.. కారణమేంటంటే..?

హైదరాబాద్: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ( BJP Party ) తరఫున 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఈ ఎమ్మెల్యేలంతా రేపు (శనివారం) జరిగే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ( Akbaruddin Owaisi ) ఉంటే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ( Raja Singh ) ప్రకటించారు. ప్రొటెం స్పీకర్‌గా ఇతరులు ఉంటేనే ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తానని రాజాసింగ్ స్పష్టంచేశారు. పూర్తిస్థాయి స్పీకర్ ఎన్నికైన తర్వాతనే ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తామని రాజాసింగ్ తెలిపారు.

మరోవైపు కొత్తగా గెలిచిన 8మంది బీజేపీ ఎమ్మెల్యేలతో రేపు (శనివారం) బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమావేశం అవుతారు. శనివారం ఉదయం 8 గంటలకు పార్టీ కార్యాలయంలో సమావేశం ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యేలకు చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభ పక్షనేతను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఫ్లోర్ లీడర్ రేసులో గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఏలేటి మహేశ్వరరెడ్డి ఉన్నారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎం రేవంత్‌రెడ్డిపై గెలిచిన ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి పేరుని కూడా హై కమాండ్ పరిశీలనలోఉన్నట్లు బీజేపీలో విసృత్తంగా చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-12-08T20:18:04+05:30 IST