Home » Business news
శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియడం, చైనా వడ్డీ రేట్లను తగ్గించడంతో దేశీయ సూచీలు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.
దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్(Hyundai Motors)కు చెందిన భారతీయ అనుబంధ సంస్థ ఈ వారంలో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది.
ప్రైవేట్ కంపెనీలు పెంచిన రీఛార్జ్ ధరలు తట్టుకోలేక లక్షలాది మంది ఇప్పటికే బీఎస్ఎన్ఎల్కు మారిపోయారు. మరోవైపు దేశంలోని అనేక నగరాల్లో బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే.. తన 4G నెట్వర్క్ ప్రారంభించింది. తాజాగా 5G నెట్వర్క్ సేవలను సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. అందులోభాగంగా సంస్థ తన సేవలను మెరుగు పరచడం కోసం వేలాది కొత్త సెల్ టవర్లను ఏర్పాటు చేసింది.
భారత స్టాక్ మార్కెట్లో వచ్చే వారం మళ్లీ కొత్త ఐపీఓలు రాబోతున్నాయి. ఈసారి ఏకంగా 9 వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీల వివరాలు ఏంటి, ఎప్పటి నుంచి రాబోతున్నాయనేది ఇప్పుడు చుద్దాం.
భారత బిలియనీర్లలో ఒకరైన పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధర ఓస్వాల్ ఆర్థిక, నేర కార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఉగాండాలో అరెస్టయ్యారు. దీంతో అసలు వసుంధర ఓస్వాల్ ఎవరు అనే ప్రశ్నలు జనాల మదిలో మొదలయ్యాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. తగ్గుతాయని భావించిన పసిడి రేట్లు పైపైకి చేరుతున్నాయి. ఈ క్రమంలో పుత్తడి ధరలు 79 వేల స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.
జీఎస్టీ నిర్మాణాన్ని సరళీకృతం చేయడానికి ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (GOM ) ఈరోజు(అక్టోబర్ 19న) బేటీ అయ్యింది. ఈ క్రమంలో ఐదు వస్తువుల పన్నును తగ్గించే ప్రతిపాదనలను సూచించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
మీరు ఇకపై మీ ఇంట్లో కూర్చుని మీ బ్యాంకు బ్యాలెన్స్ వివరాలను ఈజీగా ఒక్క క్షణంలో తెలుసుకోవచ్చు. అందుకోసం మీరు ఎలాంటి యాప్స్ ఓపెన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అదే మిస్డ్ కాల్ ఛాన్స్. దీని ద్వారా మీరు మీ బ్యాంక్ ఖాతా వివరాలను పొందవచ్చు.
దేశంలోని మహిళలకు గుడ్ న్యూస్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మహిళలకు వ్యాపారం కోసం 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తుంది. అయితే దీని కోసం ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు రిటైర్మెంట్ సమయంలో ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండా ఉండాలని చూస్తున్నారా. అయితే మీరు ఇప్పటి నుంచే ప్రతి రోజు కొంత మొత్తాన్ని సేవ్ చేయాలి. అయితే ఈ స్కీంలో ప్రతి రోజు ఎంత సేవ్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.