Adani Group: అదానీ గ్రూప్ స్టాక్స్ 65 శాతం పెరగనున్నాయా.. నిజమేనా..
ABN , Publish Date - Dec 02 , 2024 | 12:35 PM
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి చెందిన ఓ కంపెనీ స్టాక్స్ 65 శాతం పెరగవచ్చని పలు బ్రోకరేజీ సంస్థలు లక్ష్యాన్ని అందించాయి. దీనిపై అనేక మంది పెట్టుబడిదారులు ఆసక్తితో ఉన్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీ అయిన అదానీ పోర్ట్స్ & సెజ్ స్టాక్ దాని వాటాదారులకు 65 శాతం వరకు రాబడిని ఇవ్వగలదని పలు బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి. నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్, అవుట్‌పెర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ అదానీ పోర్ట్స్ షేర్లు బలమైన పెరుగుదలను చూడవచ్చని తెలిపాయి. ఈ క్రమంలో స్టాక్ ధర స్థాయి నుంచి 65 శాతం జంప్‌తో రూ. 1960 వరకు చేరవచ్చని అంచనా వేశాయి. ప్రస్తుతం (డిసెంబర్ 2న) అదానీ పోర్ట్స్ షేర్ ధర రూ.1197గా ఉంది. ఇటివల పెట్టుబడిదారుల దినోత్సవంలో భాగంగా బ్రోకరేజ్ సంస్థలు పాల్గొన్న నేపథ్యంలో ఈ స్టాక్ టార్గెట్ ధరను ప్రకటించాయి.
ఆటోమేటెడ్ పోర్ట్
2030 నాటికి అదానీ పోర్ట్స్ హ్యాండ్లింగ్ వాల్యూమ్ సామర్థ్యం 12 శాతం వార్షిక వృద్ధితో 1 బిలియన్ టన్నులకు పెరుగుతుందని నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తన నివేదికలో పేర్కొంది. లాజిస్టిక్స్ (కంటైనర్, నాన్-కంటైనర్) కంపెనీ ఆదాయానికి గణనీయంగా దోహదం చేస్తుందని వెల్లడించింది. దీంతోపాటు ఓడరేవులు, లాజిస్టిక్స్ కార్యకలాపాలలో సాంకేతిక పురోగతిలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది. దీనిలో కేరళలో ఉన్న విజింజం ఓడరేవు ఆగ్నేయాసియాలో సెమీ ఆటోమేటెడ్ అయిన మొదటి పోర్ట్ అవుతుందని, ఇది కంపెనీ బ్యాలెన్స్ షీట్‌ను మరింత బలోపేతం చేస్తుందని నివేదిక తెలిపింది.
65 శాతం పెంపుదల
నువామా నివేదిక కారణంగా అదానీ పోర్ట్స్ స్టాక్ మునుపటి ముగింపు ధర రూ. 1190 నుంచి రూ. 1211.65కి ప్రారంభమైంది. ప్రస్తుతం రూ. 1197.20 వద్ద ట్రేడవుతోంది. ఈ స్టాక్ రూ.1960 స్థాయికి వెళ్లవచ్చని అంటున్నారు. అంటే ప్రస్తుత స్థాయి నుంచి 65 శాతం మేర పెరుగుదల సాధ్యమవుతుందని నువామా చెబుతోంది. నువామాతో పాటు కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ కూడా రూ. 1630 టార్గెట్‌తో స్టాక్‌ను కొనుగోలు చేయాలని సూచించింది. కాగా మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ. 1530 టార్గెట్ ధరను ఇచ్చింది.
గరిష్ఠ స్థాయి నుంచి స్టాక్ 28 శాతం పడిపోయింది
అదానీ పోర్ట్స్ స్టాక్ గరిష్టంగా రూ. 1621 కంటే 28 శాతం దిగువన ట్రేడవుతోంది. కాగా అమెరికాలో అదానీ గ్రూప్ కంపెనీపై లంచం ఆరోపణలు రావడంతో స్టాక్‌లో భారీ పతనం జరిగింది. మూడు నెలల్లో, నవంబర్ 21, 2024న షేరు గరిష్టంగా రూ.1500 నుంచి రూ.995కి 33 శాతం పడిపోయింది. అయినప్పటికీ 2024లో స్టాక్ తన వాటాదారులకు 16 శాతం రాబడిని అందించడం విశేషం.
గమనిక: ఇక్కడ అందించిన వార్త సమాచారం కోసం మాత్రమే అందించబడింది. మార్కెట్‌లో పెట్టుబడులు చేయడం మార్కెట్ లాభనష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి క్రమంలో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి. ww.andhrajyothy.com ఎవరికీ సలహా ఇవ్వదు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..
Real vs Fake Charger: మీ ఫోన్ ఛార్జర్ నిజమైనదా, నకిలీదా.. ఇలా గుర్తించండి..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More Business News and Latest Telugu News