Bitcoin: మొదటిసారి లక్ష డాలర్లు దాటిన బిట్‌కాయిన్.. కారణమిదేనా..
ABN , Publish Date - Dec 05 , 2024 | 09:47 AM
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధర లక్ష డాలర్లు దాటింది. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, బిట్‌కాయిన్ ధరలలో నిరంతర పెరుగుదల కనిపించడం విశేషం. గత నెలలోనే బిట్‌కాయిన్ ధర 50 శాతానికి పైగా పెరిగింది.
జూలై చివరి రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ నాష్‌విల్లే బిట్‌కాయిన్ (Bitcoin) కాన్ఫరెన్స్‌కు చేరుకున్నప్పుడు ఆయన మొత్తం ప్రపంచానికి సందేశం ఇచ్చాడు. తాను అధికారంలోకి రాగానే అమెరికాను ప్రపంచానికి క్రిప్టో (Cryptocurrency) రాజధానిగా మారుస్తానని చెప్పారు. ఆ రోజు బిట్‌కాయిన్ ధరలలో 4 శాతం కంటే ఎక్కువ జంప్ అయ్యి, ధర 67 వేల డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత నవంబర్ మొదటి వారంలో అమెరికన్ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు, బిట్‌కాయిన్ ధర 67 నుంచి 68 వేల డాలర్ల మధ్య స్థాయికి చేరింది. కానీ ఇప్పుడు మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ ధర లక్ష డాలర్లను దాటేసింది. నవంబర్ 5 నుంచి బిట్‌కాయిన్ ధర 50 శాతానికి పైగా పెరగడం విశేషం.
లక్ష డాలర్లు దాటిన బిట్‌కాయిన్
Coinmarket డేటా ప్రకారం Bitcoin ధర 7 శాతం కంటే ఎక్కువ పెరుగుదలతో $ 102,656.65 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ సెషన్‌లో బిట్‌కాయిన్ ధరలు కూడా $103,900.47కి చేరుకున్నాయి. ధరల పెరుగుదల ఏ రకంగా చూసినా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే గత 24 గంటల్లో బిట్‌కాయిన్ ధర కూడా దాని దిగువ స్థాయి $94,660.52కి చేరుకుంది. ఇప్పుడు బిట్‌కాయిన్ ధర త్వరలో 1.25 లక్షల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. జనవరి 20, 2025 తర్వాత బిట్‌కాయిన్ ఈ సంఖ్యను తాకవచ్చని అంటున్నారు. అప్పటికి డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీంతో క్రిప్టోకరెన్సీ మార్కెట్‌కు సంబంధించి కొన్ని సానుకూల ప్రకటనలు ఉండవచ్చని భావిస్తున్నారు.
ఒక నెలలోనే 50 శాతం
అమెరికా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ధరలలో విపరీతమైన పెరుగుదల వచ్చింది. అంటే బిట్‌కాయిన్ ధర 50 శాతానికి పైగా పెరిగింది. గతంలో ఒక వారం గురించి మాట్లాడితే బిట్‌కాయిన్ పెట్టుబడిదారులకు 8 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. గత సంవత్సరంలో బిట్‌కాయిన్ పెట్టుబడిదారులకు 145 శాతానికి పైగా రాబడిని అందించింది. నిపుణులు ప్రకారం ఈ సంపాదన సంఖ్య సంవత్సరం చివరి నాటికి మరింత పెరుగుతుందని అంటున్నారు.
పలు దేశాల జీడీపీని దాటేసిన
మరోవైపు బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ ప్రపంచంలోని అనేక దేశాల జీడీపీని దాటేసింది. కాయిన్ మార్కెట్ క్యాప్ ప్రకారం ప్రస్తుతం బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ 2 ట్రిలియన్ డాలర్లను దాటింది. రష్యా జీడీపీకి, బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్‌కి మధ్య చాలా స్వల్ప వ్యత్యాసం ఉంది. దక్షిణ కొరియా, మెక్సికో, ఆస్ట్రేలియా, స్పెయిన్ వంటి పెద్ద దేశాల జీడీపీ కూడా బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్‌తో పోల్చితే తక్కువగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More Business News and Latest Telugu News