Home » Chennai News
పేరు ప్రఖ్యాతుల కోసమో, కాలయాపన కోసమో తాను రాజకీయప్రవేశం చేయలేదని ప్రజలతో మమేకమై వారికి సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తమిళగ వెట్రికళగం (టీవీకే) నేత, నటుడు విజయ్(Actor Vijay) పేర్కొన్నారు.
నగర వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు, ప్రత్యేకించి ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలు ప్రారంభమవుతున్న సమయంలో డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు(Dengue and Chicken Gunya fevers) వ్యాపిస్తున్నాయి.
మద్యపాన నిషేధంపై నలువైపుల నుంచి వస్తున్న ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గుతోందా?.. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని దుకాణాలను తగ్గించడంపై కసరత్తు చేస్తోందా?.. ఈ నెల 8వ తేదీ జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో ‘కీలక నిర్ణయం’ తీసుకోనున్నారా?.. అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలు కురవనున్న నేపథ్యంలో శుక్రవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
రాణీపేట జిల్లా అరక్కోణం(Arakkonam) సమీపంలోని పులియమంగళం వద్ద రైలు పట్టాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. గురువారం ఉదయం దీనిని రైల్వే ఉద్యోగి గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలిలా వున్నాయి... ఉదయం 8.50 గంటల ప్రాంతంలో తిరువనంతపురం ఎక్స్ప్రెస్ పులియమంగళం వైపు వచ్చింది.
దిగుమతులు తగ్గడంతో వెల్లుల్లి ధరలు మళ్లీ పెరిగాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్(Madhya Pradesh, Gujarat, Rajasthan), ఒడిశా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని దిండుగల్(Dindugal)లో కొండ వెల్లుల్లి సాగు చేస్తుంటారు.
రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులను(IAS officers) బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. - ఉన్నత విద్యాశాఖ, రహదారుల శాఖ కార్యదర్శి తదితర ముఖ్య బాధ్యతలు వ్యవహరించిన ప్రదీప్ యాదవ్ ఉప ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియామకం.
ప్యారీస్లోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో తిరుమల(Tirumala) గొడుగుల ఊరేగింపును తిరుకంకుడి జీయర్ రామానుజ స్వామి బుధవారం ప్రారంభించారు. తిరుమల బ్రహ్మోత్సవాల(Tirumala Brahmotsavams) సందర్భంగా నగరానికి చెందిన హిందూ ధర్మార్ధ సమితి ప్రతి ఏటా శ్రీవారికి గొడుగులు సమర్పించడం ఆనవాయితీ.
మలేసియా దేశం నుంచి విమానంలో నగరానికి అక్రమంగా తరలించిన సుమారు 5 వేలకు పైగా నక్షత్ర తాబేళ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేశారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్(Kuala Lumpur) నుంచి మలేసియన్ ఎయిర్లైన్స్ విమానం ఆదివారం అర్ధరాత్రి త్రిశూలంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి(Tirupati) వెళ్లే భక్తుల సౌకర్యార్ధం అదనపు బోగీలు అనుసంధానం చేయనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.