Share News

Supreme Court: ముఖ్యమంత్రిని కించపరచడం తప్పే..

ABN , Publish Date - Nov 27 , 2024 | 11:26 AM

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కించపరిచేలా, అగౌరవపరిచేలా మాట్లాడటం తప్పేనని, అందువల్ల ఈ కేసు విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి సీవీ షణ్ముగంకు సుప్రీంకోర్టు(Supreme Court) తేల్చి చెప్పింది.

Supreme Court: ముఖ్యమంత్రిని కించపరచడం తప్పే..

- కేసు విచారణ ఎదుర్కోవాల్సిందే

- మాజీ మంత్రి షణ్ముగంకు తేల్చిచెప్పిన సుప్రీం

చెన్నై: ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కించపరిచేలా, అగౌరవపరిచేలా మాట్లాడటం తప్పేనని, అందువల్ల ఈ కేసు విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి సీవీ షణ్ముగంకు సుప్రీంకోర్టు(Supreme Court) తేల్చి చెప్పింది. కొత్త కార్మిక చట్టం ప్రకారం 12 గంటల పని, వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు పంపించడం, గంజాయి రవాణా, మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే ఆధ్వర్యంలో గతంలో ఆందోళన జరిగింది. అందులో పాల్గొన్న సీవీ షణ్ముగం ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Oil: భర్తపై కాగుతున్న నూనె పోసిన భార్య


దీనిపై డీఎంకే నేతలు పరువు నష్టం కేసు దాఖలు చేయగా, జిల్లా కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా, సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది. అదేసమయంలో కేసు రద్దు చేయాలని కోరుతూ సీవీ షణ్ముగం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, దీనిపై అపెక్స్‌ కోర్టులో విచారణ సాగుతుంది. ఈ నేపథ్యంలో సీఎంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతూ, తన ప్రమాణ పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని సెప్టెంబరు నెల 23న సుప్రీంకోర్టు ఆదేశించింది. పైగా జిల్లా కోర్టు విచారణపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ మంగళవారం న్యాయమూర్తులు సుదన్షు తులియా, అజానుద్దీన్‌ అమనుల్లాలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.


ఈ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి(Chief Minister)కి వ్యతిరేకంగా, కించపరిచేలా మాట్లాడటం ఎంతవరకు సబబు? ఈ కేసు అంశంలో జిల్లా కోర్టు విచారణపై విధించిన స్టే ఎందుకు తొలగించ కూడదు? అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయడం సహజమే కదా? అందువల్ల ఈ కేసు విచారణను సీవీ షణ్ముగం ఎదుర్కోవాల్సిందే అంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ, తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.


ఈవార్తను కూడా చదవండి: ఎముకలు కొరికే చలి

ఈవార్తను కూడా చదవండి: అమ్మకానికి చిన్నారుల అశ్లీల వీడియోలు!

ఈవార్తను కూడా చదవండి: హోటళ్లు, రెస్టారెంట్లపై 556 కేసులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్.. నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2024 | 11:26 AM