Rains: వాయుగుండం ఎఫెక్ట్.. చెన్నైలో భారీ వర్షం
ABN , Publish Date - Nov 27 , 2024 | 11:49 AM
బంగాళాఖాతంలో ‘ఫెంగల్’ తుఫానుగా రూపుదిద్దుకోనున్న వాయుగుండం ప్రభావం కారణంగా నగరంలో మంగళవారం ఉదయం కుండపోతగా వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమైనా తేలికపాటి జల్లులే కురిశాయి.
- పలు ప్రాంతాలు జలమయం
చెన్నై: బంగాళాఖాతంలో ‘ఫెంగల్’ తుఫానుగా రూపుదిద్దుకోనున్న వాయుగుండం ప్రభావం కారణంగా నగరంలో మంగళవారం ఉదయం కుండపోతగా వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమైనా తేలికపాటి జల్లులే కురిశాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పవాయుపీడం కాస్త వాయుగుండంగా మారటంతో మంగళవారం ఉదయం 10 గంటలకు తేలికపాటి జల్లులతో ప్రారంభమైన వర్షం కాసేపటికల్లా ఉధృతమైంది. ఎగ్మూరు, పురుషవాక్కం, కోయంబేడు, మధురవాయల్, కోడంబాక్కం(Koyambedu, Madhuravayal, Kodambakkam), పెరంబూరు ఏరియాలో భారీగా వర్షాలు కురిశాయి.
ఈ వార్తను కూడా చదవండి: Supreme Court: ముఖ్యమంత్రిని కించపరచడం తప్పే..
అంతేగాక తిరువొత్తియూరు, పట్టినంబాక్కం, రాయపురం, అంబత్తూరు, కొళత్తూరు, అన్నాసాలై, రాయపేట, ట్రిప్లికేన్, మైలాపూరు, మందవెళ్లి, అడయార్, వేళచ్చేరి తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. దీనితో రహదారులు జలమయమయ్యాయి. పల్లపు ప్రాంతాలు ఆకస్మిక దీవులుగా మారాయి. ప్రధాన రహదారులలో ముందు వెళుతున్న వాహనాలను కనిపించనంతగా వర్షం కురవటంతో వాహన చోధకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇదేవిధంగా చెంగల్పట్టు, తిరువళ్లూరు(Chengalpattu, Tiruvallur) తదితర ప్రాంతాల్లోనూ జోరుగా వర్షం కురిసింది. చెంగల్పట్టు, పరనూరు, మహేంద్రా సిటీ, మరైమలర్‌నగర్, కాట్టాన్‌కుళత్తూరు ప్రాంతాల్లో వర్షానికి రహదారులు జలమయమయ్యాయి.
ఈవార్తను కూడా చదవండి: ఎముకలు కొరికే చలి
ఈవార్తను కూడా చదవండి: అమ్మకానికి చిన్నారుల అశ్లీల వీడియోలు!
ఈవార్తను కూడా చదవండి: హోటళ్లు, రెస్టారెంట్లపై 556 కేసులు
ఈవార్తను కూడా చదవండి: రేవంత్.. నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..
Read Latest Telangana News and National News