Home » Chennai News
ఓ యువకుడి మద్యం మత్తు ఐదుగురిని బలిగొంది. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో యువకుడు నడిపిన కారు ఐదుగురి ప్రాణాలను హరించివేసింది. పొట్టకూటి కోసం గొర్రెల కాపలాకు వెళ్లి, మధ్యాహ్నం రోడ్డు పక్కన చెట్టు కింద సేదతీరుతుండగా, హఠాత్తుగా దూసుకొచ్చిన కారు వారందరినీ మృత్యుఒడిలోకి నెట్టేసింది.
ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) నివాసగృహం పరిసరాల్లో కత్తితో సంచరించిన యువకుడిని పోలీసులు నిర్బంధించారు. తేనాంబపేట సెంటాఫ్ రోడ్డు(Thenambapet Centoff Road)లో స్టాలిన్ నివసిస్తున్నారు.
మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను ఈ ప్రభుత్వం సహించదని, దేశంలోనే మహిళలకు భద్రత కల్పించడంలో రాష్ట్రం ముందంజలో ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గీతాజీవన్(Minister Geethajeevan) స్పష్టం చేశారు.
భారత రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు తెలుసుకుని పాటించాలని అగ్రహీరో, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్(Kamal Haasan) పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 75 యేళ్ళ క్రితం ఇదే రోజు దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం రూపొందిందన్నారు.
బంగాళాఖాతంలో ‘ఫెంగల్’ తుఫానుగా రూపుదిద్దుకోనున్న వాయుగుండం ప్రభావం కారణంగా నగరంలో మంగళవారం ఉదయం కుండపోతగా వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమైనా తేలికపాటి జల్లులే కురిశాయి.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కించపరిచేలా, అగౌరవపరిచేలా మాట్లాడటం తప్పేనని, అందువల్ల ఈ కేసు విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి సీవీ షణ్ముగంకు సుప్రీంకోర్టు(Supreme Court) తేల్చి చెప్పింది.
నగర శివారు ప్రాంతమైన చోమంగళం(Chomangalam)లో మద్యం తాగి వచ్చి రచ్చ చేసిన భర్తపై భార్య సలసల కాగే నూనె పోసింది. దీంతో భర్తకు గాయాలవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చోమంగళం సమీపంలోని పుదునల్లూరు(Pudunallur) ప్రాంతంలో రవి (45), జయంతి (40) అనే దంపతులున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారే అవకాశముందని భారత వాతావరణ పరిశోధన మండలి హెచ్చరించడంతో ఆరు జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
రాష్ట్ర అసెంబ్లీకి 2026లో జరుగబోయే ఎన్నికల్లో కూడా ఘనవిజయం సాధించి ద్రావిడ మోడల్ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా డీఎంకే కార్యకర్తలు యుద్ధ సైనికుల్లా పనిచేయాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి(Deputy CM Udhayanidhi) సూచించారు.
కుటుంబ కార్డులకు జనవరి మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా పొంగల్(Pongal) గిఫ్ట్తో చీర, ధోవతి పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి గాంధీ(Minister Gandhi) పేర్కొన్నారు. ఈ అంశంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.