Home » Chennai News
విల్లుపురం జిల్లా విక్రవాండిలో అక్టోబరు 27న నిర్వహించనున్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) మహానాడును విజయవంతం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి మహానాడులో పాల్గొనరాదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు విజయ్(Movie actor Vijay) సూచించారు.
త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ప్రకటించారు. మంగళవారం ఉదయం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొళత్తూరు శాసనసభ నియోజకవర్గంలో కార్పొరేషన్, సీఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రంలో విడతలవారీగా మద్యందుకాణాలు మూసివేసేలా చర్యలు చేపట్టనున్నామని గృహవసతి, ఎక్సైజ్ శాఖ మంత్రి ఎస్. ముత్తుస్వామి(Minister S. Muthuswamy) తెలిపారు. మూసివేయనున్న టాస్మాక్ మద్యం దుకాణాల వివరాలు సేకరిస్తున్నామని, త్వరలో ఆ దుకాణాల జాబితా విడుదల చేస్తామని తెలిపారు.
చెంగల్పట్టు జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన చారిత్రక నగరం మహాబలిపురం(Mahabalipuram)లో సముద్రం వెనక్కిమళ్ళడంతో సముద్రతీర దేవాలయం వద్దనున్న మహిషాసుర మర్థిని గుహాలయం పూర్తిగా దర్శనమిచ్చింది. దీంతో స్థానికులు, పర్యాటకులు ఆలయంలోని దుర్గాదేవిని దర్శించేందుకు బారులు తీరారు.
రాష్ట్రవ్యాప్తంగా రైల్వేస్టేషన్ల సమీపంలో ఉన్న 39 టాస్మాక్ మద్యం దుకాణాలను తొలగించాలని రాష్ట్రప్రభుత్వాన్ని దక్షిణ రైల్వే(Southern Railway) కోరింది. చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు(Chennai, Thiruvallur, Kanchipuram, Chengalpattu) సహా పలు జిల్లాలకు నడుపుతున్న రైలు ప్రయాణికుల వద్ద దోపిడీ, దాడి సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో రైళ్లు ఢీకొని ప్రజలు మరణించడంపై దక్షిణ రైల్వే తాజాగా ఓ సర్వే నిర్వహించింది.
క్రికెట్(Cricket) ఆడుతున్న యువకుడు హఠాత్తుగా స్పృహతప్పి మృతిచెందిన ఘటన చెంగల్పట్టు జిల్లాలో చోటుచేసుకుంది. ఉత్తరమేరూర్ సమీపం కన్నకొళత్తూర్ ప్రాంతానికి చెందిన బాలాజీ (32) రెండు రోజుల క్రితం మామ ఊరైన నొలంబూర్(Nolambur) వచ్చాడు.
నీలగిరి(Neelagiri) జిల్లాలో గత కొద్ది రోజులుగా వన్యమృగాలు అడవుల నుండి వచ్చి జనావాస ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. నీరు, ఆహారం కోసం ఆ జంతువులు కొండదిగువనున్న నివాసాల్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఊటీ(Ooty) నుంచి మంజూరు మీదుగా కోవై వెళ్లే రహదారిలో ఓ పెద్ద ఎలుగుబంటిని చూసి వాహన చోధకులు భీతిల్లారు.
సినీనటుడు విజయ్(Actor Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడు అక్టోబర్ మూడో వారంలో నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ నెల 23న విక్రవాండిలో ఈ మహానాడును నిర్వహించేందుకు పోలీసుల అనుమతి లభించినప్పటికీ ఆ మహానాడు నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టలేదు.
ఊటీ(Ooty) సమీపం ఎప్పనాడు కొండ ప్రాంతాల్లో, 12 ఏళ్లకు ఒకసారి పూసే ‘కురింజి’ పూలు వికసించడం ప్రారంభించాయి. ఈ ప్రాంతంలోని కొండపై సంతరించుకున్న పూల అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఓనం పండుగ సందర్భంగా పూల ధరలు పెరిగాయి. కిలో మల్లెపూలు రూ.2,000కు విక్రయమవుతున్నాయి. పండుగ సందర్భంగా మలయాళీయులు పువ్వులతో వివిధ రకాల ముగ్గులు వేస్తుంటారు. దీంతో, తిరువనంతపురం(Thiruvananthapuram) చుట్టుపక్కల ప్రాంతాలకు కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లా దోవాలై నుంచి పూలు ఎగుమతి చేస్తుంటారు.