Home » CID
తాడేపల్లిలోని SIT కార్యాలయంలో రేపు ఉదయం 10 గంటలకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు(Inner Ring Road Case)లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh)ని ఏపీ సీఐడీ(AP CID) విచారించనుంది.
స్కిల్ డెవలప్మెంట్ (Skill Development) అక్రమ కేసులో రిమాండ్ ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరోసారి నిరాశ ఎదురైంది.
మరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ కేసులో కొత్తగా మరో నలుగురిని అధికారులు నిందితులుగా చేర్చారు. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల, ఆవుల మణి శంకర్, రాపూరి సాంబశివరావులను నిందితులుగా చేర్చడం జరిగింది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Nara Chandrababu) అక్టోబర్-09 అత్యంత కీలకం కానుంది. బాబుపై సీఐడీ (CID), పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు..
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో మూడో విచారణ జరుగుతోంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తవ్వగా ప్రస్తుతం కస్టడీ పిటిషన్‌పై వాదనలు జరగుతున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill development case) ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నేడు (గురువారం) వాదనలు కొనసాగుతున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విషయంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నేడు (గురువారం) కూడా విచారణ వాయిదా పడింది. తదుపరి వాదనలను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.
ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణను విజయవాడ ఏసీబీ కోర్ట్ రేపటికి (గురువారం) వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇరువురు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి మిగతా వాదనలను గురువారం 11.15 గంటలకు వింటానని చెప్పారు.
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ సాగుతోంది. చంద్రబాబు తరపున ప్రమోద్ దూబే వాదనలు వినిపించారు. సీఐడీ తరపును న్యాయవాది, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు విపించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సీఐడీ విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. ఈ మేరకు సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో లోకేష్ సవాల్ చేశారు. లోకేష్ ఇచ్చిన లంచ్ మోషన్ పిటీషన్‌పై ఈరోజు(మంగళవారం) హైకోర్టులో విచారణ జరిగింది. లోకేశ్ ప్రస్తుతం హెరిటేజ్‌లో షేర్ హోల్డర్ లోకేష్ తరపు న్యాయవాదులు చెప్పారు.