Home » CPM
Telangana: భూమాత పోర్టల్‌పై రైతులతో చర్చ పెట్టాల్సిందే అని సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులతో చర్చ తరువాతే అమలు చేయాలన్నారు. భూ మాత పేరుతో కాంగ్రెస్ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతున్నారని అన్నారు. బీజేపీ మతతత్వ ఆలోచనల్ని కనసాగిస్తోందని మండిపడ్డారు.
ఎక్కడ అక్రమాలు ఉన్న కూల్చివేయడం మంచి నిర్ణయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. హైడ్రాపై సీపీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించిన విధానంతో సీపీఎం రాష్ట్ర శాఖలో ముసలం పుట్టింది. దీంతో కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆర్.రఘుపై పార్టీ నాయకత్వం బహిష్కరణ వేటు వేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం..
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ (80) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. గతేడాది న్యుమోనియా సోకడంపాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) గురువారం నాడు మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన పట్ల మన్నించాల్సిందిగా ట్విట్టర్(X)లో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సంచలన ట్వీట్ చేశారు.
ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు (B V Raghavulu) డిమాండ్ చేశారు. రెండు రోజుల పాటు సీపీఎం సమావేశాలు నిర్వహించారు.
రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆరోగ్య పరీక్షల పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని సీపీఎం ఆరోపించింది. ఎలాంటి టెండర్లు లేకుండానే గత ప్రభుత్వం ముంబైకి చెందిన సీఎ్‌ససీ హెల్త్‌కేర్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చిందని పేర్కొంది.
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ బలంగా ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో ఓటమి పాలవడంపై సీపీఎం పార్టీ ఆత్మ విశ్లేషణ చేసుకుంది.
బొగ్గు గనుల వేలంపాటను రద్దు చేయాలని, బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. తెలంగాణ రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం సోమవారం హైదరాబాద్ ఎంబీ భవన్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.
నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేయాలని సీపీఎం కోరింది.