CPM : జిల్లాలోని అన్ని చెరువులను నీటితో నింపాలి
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:20 AM
జిల్లాలోని అన్ని చెరువులను నీటితో నింపి, రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. సాగు, తాగు నీరు, రైతు సమస్యల పరిష్కారం కోసం శనివారం రాప్తాడు బస్టాండు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో బస్సు జాతా నిర్వహిం చారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్
రాప్తాడు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని చెరువులను నీటితో నింపి, రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. సాగు, తాగు నీరు, రైతు సమస్యల పరిష్కారం కోసం శనివారం రాప్తాడు బస్టాండు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో బస్సు జాతా నిర్వహిం చారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద రైతు సమస్యలపై సోమవారం ధర్నా చేపడతామన్నారు. ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ చెరువు లకు, ఆయకట్టుకు నీరు ఇవ్వకపోతే రైతులు ఇబ్బంది పడతా రన్నారు. తుంగభద్ర డ్యాంకు కొత్త గేట్లు అమర్చాలన్నారు. హెచ్చెల్సీ ఆధునీకరణ పనులు చేపట్టాలన్నారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు జీడిపల్లి నుంచి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలన్నారు. రైతులందరికీ సబ్సిడీ డ్రిప్పు, వ్యవసాయ పరికరాలు ఇవ్వాలన్నారు. సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకాల నిర్వహణకు నిధులు కేటాయించాలన్నారు. భారీ వర్షాల వలన వలన నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహా రం అందించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల అధ్యక్షుడు పోతులయ్య, జిల్లా కమిటీ సభ్యుడు రామాంజినేయులు, సత్యసాయి జిల్లా అద్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న, శివకుమార్, రైతులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....