Share News

Tributes to Sitaram Yechury: చివరి వరకు విలువలతో జీవించిన వ్యక్తి ఏచూరి.. అమెరికాలో సంస్మరణ సభ

ABN , Publish Date - Oct 09 , 2024 | 11:32 AM

డెమోక్రాటిక్ పార్టీ కోలిన్ కౌంటి అభ్యర్థి సందీప్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి గొప్ప మేధావి అని కొనియాడారు. అమెరికా, భారత్ రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలని, భారత్‌లో ప్రజాస్వామ్య విలువల కోసం సీతారాం ఏచూరి ఎలామ పోరాడారో.. తాము కూడా ప్రజాస్వామ్య విలువల కోసం ..

Tributes to Sitaram Yechury: చివరి వరకు విలువలతో జీవించిన వ్యక్తి ఏచూరి.. అమెరికాలో సంస్మరణ సభ
Tributes to Sitaram Yechury

సీతారాం ఏచూరి జీవితం నేటి తరానికి ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో టెక్సాస్ ఇండియా సంకీర్ణం, డల్లాస్ ప్రోగ్రెసివ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో దివంగత సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డెమోక్రాటిక్ పార్టీ కోలిన్ కౌంటి అభ్యర్థి సందీప్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి గొప్ప మేధావి అని కొనియాడారు. అమెరికా, భారత్ రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలని, భారత్‌లో ప్రజాస్వామ్య విలువల కోసం సీతారాం ఏచూరి ఎలామ పోరాడారో.. తాము కూడా ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడుతున్నామని తెలిపారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) మాజీ అధ్యక్షులు బాపయ్య మాట్లాడుతూ సీతారాం ఏచూరి దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్నో ప్రజా ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించారన్నారు. పేద ప్రజల కోసం చివరి వరకు పోరాడిన నేత సీతారాం ఏచూరి అని తెలిపారు. జెకె వెంకట్ మాట్లాడుతూ.. మతోన్మాదానికి వ్యతిరేకంగా సీతారాం చేసిన అవిశ్రాంత పోరాటాన్ని ప్రశంసించారు. పార్లమెంటులో ప్రజల హక్కుల కోసం ఆయన మాట్లాడిన తీరుని గుర్తుచేసుకున్నారు. శ్రీధర్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి భరతమాత ముద్దుబిడ్డ అని కీర్తించారు. ఏచూరి ప్రేరణతో అనేకమంది విద్యార్థులు ప్రజాస్వామ్య, లౌకిక, అభ్యుదయ మార్గాల్లో ప్రయాణిస్తున్నారన్నారు.


హక్కుల కోసం పోరాటం..

టెక్సాస్ ఇండియా సంకీర్ణం నాయకుడు మార్టిన్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడరన్నారు. చివరి వరకు ఆయన విలువలతో జీవించారన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి భారతదేశానికి అందించిన సేవలను, సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో ఆయన చేసిన కృషిని కొనియాడారు. కార్మిక, కర్షక, విద్యార్థి, మహిళ ల ప్రయోజనాల కోసం సీపీఎం ఆధ్వర్యంలో ఆయన నిర్వహించిన ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు.


పాటలతో నివాళులు..

లెనిన్ అతని మిత్ర బృందం సీతారాం ఏచూరి కి నివాళులు అర్పిస్తూ విప్లవ గీతాలు, దేశభక్తి గేయాలు ఆలపించారు. సీతారం ఏచూరి మరణం తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. అనంతరం ఏచూరి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి.. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఏచూరి జీవిత విశేషాలతో కూడుకున్న ప్రొమోను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వందలాదిమంది హాజరై సీతారాం ఏచూరికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజా, చైతన్య, నగేష్, అఖిల, విష్ణు, అరవింద్, అతుల్ షిండే, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 09 , 2024 | 11:33 AM