Home » Cyber Crime
దేశవ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాలు(Cyber Crimes) పెరిగిపోతున్నాయి. ఈ తరహా నేరాలపై ఎంతగా అవగాహన కల్పించాలని ప్రయత్నించినా.. మారుమూల గ్రామాల్లో చాలా మంది ఇప్పటికీ మోసపోతున్నారు. ఓటీపీ చెప్పడం, లింకులు క్లిక్ చేస్తూ రూ.లక్షలు పోగొట్టుకున్న ఎంతో మంది బాధితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కీలక సూచనలు చేశారు.
డ్రగ్స్, సైబర్ నేరాల విషయంలో ఉక్కుపాదం మోపాలని పోలీస్ శాఖను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. భద్రతపై ప్రజలకు భరోసా కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, అవసరమైతే డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు క్షేత్ర స్థాయి (ఫిజికల్ పోలీసింగ్)లో ఉండాలని స్పష్టం చేశారు. పోలీస్ కళ్లెదుటే ఉన్నాడనేలా రహదారులపై కనిపించాలని సూచించారు.
ఉద్యోగాల పేరుతో సైబరాబాద్ పరిధిలో భారీ మోసం జరిగింది. కిలారు సీతయ్య అనే వ్యక్తి పేరు మోసిన కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేశాడు. ఆ నగదుతో ఆన్లైన్ గేమ్స్, ట్రేడింగ్, జల్సాలు చేశాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుణ్ని అరెస్టు చేశారు.
డ్రగ్స్కేసులో కుమారుడు పట్టుబడ్డాడని తల్లిదండ్రులను బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) వారి నుంచి రూ.50వేలు దోపిడీ చేశారు. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది.
పోలీసు విభాగాలు, దర్యాప్తు సంస్థల పేరిట సైబర్ మోసగాళ్లు నకిలీ ఈ మెయిళ్లు, నోటీసులు పంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయని.. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోంశాఖకు చెందిన ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్’ (ఐ4సీ) ప్రజలకు సూచించింది.
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు కర్ణాటక వినియోగదారుల ఫోరం రూ.60వేల జరిమానా విధించింది. ధారవాడకు చెందిన షీతల్ అనే మహిళ 2023 ఆగస్టు 31న ఆన్లైన్లో మోమోస్ ను ఆర్డర్ చేశారు.
కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో భారతదేశ యువకులను పంపి.. అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠాలోని కీలక నిందితుడిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎ్సబీ) అరెస్టు చేసింది.
ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై మహారాష్ట్ర సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ధ్రువ్ రాఠీ పేరిట ఉన్న ఓ పేరడీ ‘ఎక్స్’ ఖాతా నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కుమార్తెకు సంబంధించి తప్పుడు సమాచారం పోస్టు చేసిన నేపథ్యంలో..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కంబోడియా సైబర్ నేరగాళ్ల కేసులో కీలక నిందితుణ్ని సైబర్ సెక్యురిటీ పోలీసులు అరెస్టు చేశారు. చైనీయులతో చేతులు కలిపి భారతదేశానికి చెందిన నిరుద్యోగులను కంబోడియా పంపించడంలో కీలకంగా వ్యవహరిస్తు్న్న అబ్దుల్ అలాంను ఢిల్లీలో పట్టుకున్నారు.
వర్క్ ఫ్రం హోం(Work from home) పేరుతో సైబర్ నేరగాళ్ల(Cybercriminals) చేతిలో ఓ మహిళ మోసపోయిన ఘటన శుక్రవారం మేడ్చల్ జిల్లా కీసర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండల కేంద్రంలో నివసించే లహరి గృహిణి. కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న రాక్ ఫ్రంట్ కాలనీలో నివసిస్తుంది.