Share News

Bengaluru : జొమాటోకు రూ.60 వేల జరిమానా

ABN , Publish Date - Jul 15 , 2024 | 03:43 AM

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు కర్ణాటక వినియోగదారుల ఫోరం రూ.60వేల జరిమానా విధించింది. ధారవాడకు చెందిన షీతల్‌ అనే మహిళ 2023 ఆగస్టు 31న ఆన్‌లైన్‌లో మోమోస్ ను ఆర్డర్‌ చేశారు.

Bengaluru : జొమాటోకు రూ.60 వేల జరిమానా

బెంగళూరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు కర్ణాటక వినియోగదారుల ఫోరం రూ.60వేల జరిమానా విధించింది. ధారవాడకు చెందిన షీతల్‌ అనే మహిళ 2023 ఆగస్టు 31న ఆన్‌లైన్‌లో మోమో్‌సను ఆర్డర్‌ చేశారు. రూ.133.25 మొత్తాన్ని గూగుల్‌ పే చేశారు.

15 నిమిషాల తర్వాత ఆర్డర్‌ డెలివరీ అయినట్టు సందేశం వచ్చింది. జొమాటో సంస్థ మాత్రం డెలివరీ చేయలేదు. దీంతో ఆమె తన ఆర్డర్‌ గురించి ప్రశ్నించగా డెలివరీ ఏజెంట్‌ ఆర్డర్‌ తీసుకున్నారని రెస్టారెంట్‌ నిర్వాహకులు బదులిచ్చారు. వెబ్‌సైట్‌ ద్వారా డెలివరీ ఏజెంట్‌ను అడిగేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో జొమాటో సంస్థకు ఈ-మెయిల్‌ చేయగా..

72 గంటలపాటు వేచి ఉండాలని బదులిచ్చారు. తర్వాత జొమాటో నుంచి తన డబ్బుల రీఫండ్‌ కోసం యత్నించగా సాధ్యం కాలేదు. దీంతో ఆమె.. 2023 సెప్టెంబరు 13న జొమాటో సంస్థకు లీగల్‌ నోటీసు ఇచ్చారు. సంస్థ సేవలు నాసిరకంగా ఉన్నాయని, మానసికంగా ఇబ్బంది కలిగించారని ధారవాడ జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన ఫోరం బాధితురాలికి మానసిక ఇబ్బందికి కలిగించినందుకు రూ.50 వేలు, కోర్టు దావా ఖర్చులకు రూ.10 వేలు మొత్తం 60వేలు చెల్లించాలని జొమాటో సంస్థను ఆదేశిస్తూ ఈ నెల 3న తీర్పునిచ్చింది.

Updated Date - Jul 15 , 2024 | 03:44 AM