Home » Damodara Rajanarasimha
వచ్చే ఏడాది నుంచి చౌక ధర దుకాణాల ద్వారా సన్నం బియ్యం పంపిణీ చేయాలని.. కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ విఽధి విధానాలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
అసలే వర్షాకాలం కావడంతో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వ్యాధుల నివారణపై చర్చించడానికి కేంద్ర మంత్రితో రాష్ట్ర మంత్రి వర్చువల్గా సమావేశం అయ్యారు.
సంగారెడ్డిలో ఐదు వందల పడకలతో ప్రభుత్వ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, సిబ్బంది బదిలీలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ స్పష్టం చేశారు.
జీవో నంబర్ 80 ప్రకారమే దీర్ఘకాలికంగా ఒకే చోట విధులను నిర్వహిస్తున్న 40 శాతం ఉద్యోగుల సర్వీసును గుర్తించి బదిలీల ప్రక్రియ చేపట్టామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ(Damodar Rajanarasimha) తెలిపారు.
వైద్యరంగంలో జవాబుదారీతనం ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా(Damodar Rajanarasimha) పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యుల బదిలీలను నిలిపివేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
ఎస్సీ వర్గీకరణ చట్ట రూపం దాల్చేవరకు కలిసికట్టుగా ముందుకు సాగాలని మంత్రి దామెదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రాలు వర్గీకరణను చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమని వ్యాఖ్యానించారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) తెలిపారు. తీర్పును ప్రభుత్వం భవిష్యత్తులో అమలు చేస్తుందని.. సీఎం రేవంత్ రెడ్డి శాసన సభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తుచేశారు.
వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు.