Home » Devotees
విజయవాడ: ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం భవాని దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం ఐదు రోజులపాటు కొనసాగనుంది. ఆలయ అధికారులు, అర్చక స్వాములు నాలుగు హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
నంద్యాల జిల్లా: ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు కావడంతో దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది.
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య(Ayodya)కు వచ్చే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శబరిమలలో(Sabarimala Temple) భక్తుల రద్దీ కొనసాగుతోంది. రోజుకి సరాసరి 80 వేల మంది భక్తులు అయ్యప్ప స్వామి(Lord Ayyappa)ని దర్శించుకుంటున్నారు.
యాదాద్రి: పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో భక్తులరద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.
యాదాద్రి: కార్తీకమాసం, ఆదివారం కావడంతో యాదగిరిగుట్టకు భక్తులరద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామి వారి ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.
మధ్యప్రదేశ్(Madyapradesh)లోని ఓ గ్రామం తనకంటూ ఓ స్పెషాలిటీని చూపుతూ వార్తలో నిలిచింది. వివరాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని(Ujjain) జిల్లా కేంద్రానికి 75 కి.మీ.ల దూరంలో బద్నగర్ తహసీల్ లో భిదావద్(Bhidavad) అనే గ్రామం ఉంది. అక్కడ ఏళ్లుగా ఓ సంప్రదాయం(Unique Tradition) ఉంది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.
కర్నూలు జిల్లా: దేవరగట్టులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేవరగట్టు రక్తసిక్తమైంది. బన్నీ ఉత్సవంలో మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. విగ్రహాల కోసం రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకున్నారు.