Home » Districts
అనంతపురం నగరంలో ఐదురోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు బుధవారం గంగమ్మ ఒడికి చేరారు. అంతకు మునుపు మండపాల వద్ద పెద్దఎత్తున అన్నదానం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సప్తగిరి సర్కిల్లోని వినాయక్ చౌక్ వరకూ శోభాయాత్రలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి దారిపొడవునా భక్తులు బారులు తీరారు. ఆకట్టుకునే వేషధారణలతో రంగులు చల్లుకుంటూ యువత ఉత్సాహంగా వేడుకలలో పాల్గొంది. వినాయక్ ...
మండల పరిధిలోని సుద్దకుంటపల్లిలో గంగాధర్ అనే వ్యక్తి నాటు తుపాకీతో మంగళవారం హల్చల్ చేశాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులో రాజీకి రావాలని బెదిరించాడు. దీంతో బాధితులు ఎదురు తిరిగి గంగాధర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. గంగాధర్ తనను వేధిస్తున్నారని సుద్దకుంటపల్లికి చెందిన ఎంపీటీసీ సాయిలీల ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ...
జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా వీధివీధినా బొజ్జగణపయ్య కొలువై భక్త కోటికి కనువిందు చేశాడు. గణనాథుడిని కొలువుదీర్చేందుకు భక్తులు మండపాలను ఎంతో అందంగా అలంకరించారు. ఉదయమే కొలుదీర్చిన బొజ్జ గనపయ్యకు వివిధ పత్రాలు, పూలు సమర్పించి పూజలు చేశారు. ఉండ్రాళ్లు, చెరుకు గడలు వివిధ రకాల పిండి వంటలను స్వామి ...
చెరువు ఆక్రమించుకున్నారని తెలిసినా చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండింది. దీంతో నీరంతా ఆక్రమణకు గురైన భూమిలో చేరింది. ఆ నీటిని తిరిగి చెరువులోకి పంపేందుకు స్థానికంగా కట్టను కొంత తొలగించారు. మరో మారు ఓ మోస్తరు వర్షం కురిసినా స్థానికంగా నిర్మించుకున్న ఇళ్లు నీటమునిగే ప్రమాదం ఉంది. అయినా సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు....
బదిలీలపై గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అయోమయం కొనసాగుతోంది. ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వం లో ఉన్న అధికారులు, ఇతర ఉద్యోగులను మార్చుకోవడం ఆనవాయితీ. అయితే ప్రస్తుత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఇంకా చాలా శాఖలలో అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయలేదు. దీనివల్ల కొన్ని శాఖలలో సమస్యలు...
తుంగభద్ర ప్రాజెక్టును ఈ నెల 9, 10 తేదీలలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎనడీఎ్‌సఏ) నియమించిన నిపుణుల కమిటీ సందర్శించనుంది. గత నెల 10న చైన లింగ్ తెగిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ నంబరు క్రస్ట్‌గేట్‌తో పాటుగా మిగిలిన 32 క్రస్ట్‌గేట్ల భద్రత, ఇతర అంశాల అధ్యయనం కోసం ఈ బృందం వస్తోంది. జాతీయ జలాశయాలు భద్రతా సంస్థ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన ఏకే బజాజ్ నేతృత్వంలో ఢిల్లీకి చెందిన రిటైర్డ్ మెకానికల్ ఇంజనీరింగ్ నిపుణుడు హర్కేశ ...
గురువే ప్రతి ఒక్కరికీ గైడ్, ఫిలాసఫర్ అని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ డ్రామా హాల్లో గురువారం గురుపూజోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాణాలు కాపాడే డాక్టర్‌ను వైద్యో నారాయణో హరి అంటారని, అయితే గురువును సాక్షాత్తు..
ఉపాధ్యాయ దినోత్సవం వివాదాలకు తావిస్తోంది. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ఎంపికలో ఆశ్రిత పక్షపాతం చూపించారని విమర్శలు వస్తున్నాయి. కొన్ని మండలాలకు ప్రాధాన్యం ఇవ్వడం, పది మండలాలలో ఒక్కరినీ ఎంపిక చేయకపోవడం విస్తుగొలుపుతోంది. వేడుక నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులు, ఎంఈఓలు తమ వెంట నడిచేవారి, నచ్చిన వారి పేర్లను అవార్డుల జాబితాలో చేర్పించారని ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ...
వారం రోజుల్లోనే భర్త, కుమారుడు జ్వరంతో మృతి చెందడంతో ఆ ఇల్లాలు కన్నీరు మున్నీరుగా విలపించడం చూపరులకు సైతం కంటతడి పెట్టించింది. గార్లదిన్నె మండ లం ఇల్లూరుకు చెందిన వన్నూరుస్వామి(40) ఆయన కుమారుడు అబ్దుల్లా(15) వారం రోజుల కిందట జ్వరంతో బాధపడుతూ స్థానిక ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకు న్నారు. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు గత నెల 31న చికిత్సకోసం జిల్లా సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు వన్నూరుస్వామి పరిస్థితి సీరియ్‌సగా ఉందని చెప్పడంతో అదేరోజు రాత్రి నగరంలోని ఓప్రైవేటు ఆస్పత్రికి ..
ప్రభుత్వ పనులు దక్కితే సంతోషపడ్డారు. చకచకా నిర్మాణాలు కూడా ప్రారంభించారు. అయితే పనులు ఎంత మేరకు చేసినా బిల్లులు రాకపోవడంతో అర్ధంతరంగా ఆపేశారు. ఈక్రమంలోనే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు రావడం, వైసీపీ ఓడిపోయి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో గత ప్రభుత్వ పాలనలో చేసిన పనులకు బిల్లులు వస్తాయో..