Home » Drugs Case
నగరంలో డ్రగ్స్ సరఫరా రోజురోజుకు కొంతపుంతలు తొక్కుతోంది. డ్రగ్స్ నివారణకు తెలంగాణ నార్కొటిక్ బ్యూరో(TS-NAB), పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా పరిస్థితి మాత్రం అదుపులోకి వచ్చినట్లు కనపడడం లేదు. డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందంటూ నగరంలోని జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లోని పబ్బుల్లో నిరంతరం పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.
గంజాయికి అలవాటుపడిన ఓ బీటెక్ విద్యార్థి డ్రగ్ పెడ్లర్(Drug peddler)గా మారాడు. ఈ క్రమంలో గంజాయి సేవిస్తుండగా.. అతడితో పాటు మరో ఐదుగురు విద్యార్థులను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సాధారణంగా ఐటీ, పరిశ్రమలు, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు రాష్ట్రాలు పోటీ పడతాయి. జగన్ ఐదేళ్ల పాలనలో ఈ రంగాల్లో ఏపీ అట్టడుగున ఎక్కడో ఉంది.
Telangana: నగరంలో సంచలనంగా మారిన నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేతికి చిక్కిన డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో.. ఈ కేసుకు సంబంధించి మొత్తం 20 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల్లో 7 గురు ఫెడ్లర్లు, 13 మంది కన్యుమర్లు ఉన్నారు.
నగరంలో సోమవారం పట్టుబడ్డ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్(International drug racket)ను విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఇద్దరు నైజీరియన్లు సహా.. ఐదుగురిని అరెస్టు చేసిన తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు.. వారిని విచారించిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
డ్రగ్స్, సైబర్ నేరాల విషయంలో ఉక్కుపాదం మోపాలని పోలీస్ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భద్రతపై ప్రజలకు భరోసా కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, అవసరమైతే డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు క్షేత్ర స్థాయి (ఫిజికల్ పోలీసింగ్)లో ఉండాలని స్పష్టం చేశారు. పోలీస్ కళ్లెదుటే ఉన్నాడనేలా రహదారులపై కనిపించాలని సూచించారు.
ఉచెన్నా.. ఎజియోనిలి ఫ్రాంక్లిన్ ఉచెన్నా అలియాస్ కలేషీ..! ఎనిమిదేళ్లుగా హైదరాబాద్ నగరంలోనే తిష్ట వేశాడు. నైజీరియా నుంచి డ్రగ్స్ తెప్పించి.. నగరంలో విక్రయించాడు.
Telangana: రాష్ట్రంలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. రాజేంద్రనగర్ డివిజన్లో నార్కోటిక్ బ్యూరో, ఎస్వోటీ, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో దాదాపు 200 గ్రాముల కొకైన్ పట్టుబడింది. అలాగే ఈకేసుకు సంబంధించి మొత్తం 18 మందిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం నెంబర్ 1012 ... సెక్షన్ 22(సీ),27(ఏ),27(ఏ)29 ఆర్/డబ్ల్యూ, 8సీ ఎన్డీపీసీ యాక్ట్ కింద కేసులు నమోదు అయ్యాయి.
ప్రముఖ సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ ప్రీత్‌సింగ్ తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో(టీజీ న్యాబ్)కు చిక్కాడు. హైదరాబాద్ హైదర్షాకోట్లోని విశాఖనగర్ వ్యూ అపార్ట్మెంట్లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఉన్నట్లు సమాచారం అందుకున్న టీజీ న్యాబ్ అధికారులు.. సైబరాబాద్ పోలీసులతో కలిసి దాడులు చేశారు.
Telangana: ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సైబరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ డివిజన్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు నైజనీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.