Share News

Crime News: డ్రగ్స్ సరఫరాలో కొత్త కోణం.. ర్యాపిడో ద్వారా డ్రగ్స్ సరఫరా..

ABN , Publish Date - Jul 20 , 2024 | 08:07 PM

నగరంలో డ్రగ్స్ సరఫరా రోజురోజుకు కొంతపుంతలు తొక్కుతోంది. డ్రగ్స్ నివారణకు తెలంగాణ నార్కొటిక్ బ్యూరో(TS-NAB), పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా పరిస్థితి మాత్రం అదుపులోకి వచ్చినట్లు కనపడడం లేదు. డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందంటూ నగరంలోని జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లోని పబ్బుల్లో నిరంతరం పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.

Crime News: డ్రగ్స్ సరఫరాలో కొత్త కోణం.. ర్యాపిడో ద్వారా డ్రగ్స్ సరఫరా..

హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ సరఫరా రోజురోజుకు కొంతపుంతలు తొక్కుతోంది. డ్రగ్స్ నివారణకు తెలంగాణ నార్కొటిక్ బ్యూరో(TS-NAB), పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా పరిస్థితి మాత్రం అదుపులోకి వచ్చినట్లు కనపడడం లేదు. డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందంటూ నగరంలోని జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లోని పబ్బుల్లో నిరంతరం పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఆ దాడుల్లో విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు మత్తుపదార్థాలు వినియోగిస్తూ పట్టుపడిన సంఘటనలు ఎన్నో గతంలో వెలుగులోకి వచ్చాయి.


డ్రగ్స్, గంజాయి, ఈ-సిగరెట్ల వినియోగం, సరఫరాపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పోలీసులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు. 100కిలోలకు పైగా గంజాయి పట్టించిన వారికి రూ.2లక్షల రివార్డును సైతం పోలీసులు ప్రకటించారు. అయితే పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ డ్రగ్స్ సరఫరాదారులు మాత్రం నిరంతరం కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బొడుప్పల్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ర్యాపిడో డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు.


ఎన్వలప్‌లో డ్రగ్స్ ప్యాక్ చేసి ర్యాపిడో ద్వారా వాటిని వినియోగదారులకు సప్లై చేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్వోటీ, మేడిపల్లి పోలీసులు నిందితుడు దినేష్ కల్యాణ్‌ని రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి 10గ్రాముల హెరాయిన్, ఒక బైక్, తూకం, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ పెడ్లర్ దినేష్ కుమార్ ద్వారా హైదరాబాద్‌లో దినేష్ కల్యాణ్ మత్తుపదార్థాలు డెలివరీ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ప్రతి డెలివరీకి రూ.500ఎక్కువగా సంపాదిస్తుండడంతో దినేష్ కల్యాణ్ 6నెలలుగా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - Jul 20 , 2024 | 08:07 PM