Home » Election Results
ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ప్రజలు బీజేపీ పార్టీపై విశ్వాసంతో ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM Modi ) వ్యాఖ్యానించారు.
పదేళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టలేకపోయారు. మూడోసారి విజయంపై ధీమాగా ఉన్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు షాకిచ్చారు. ప్రజారంజక పాలన అందించామని గొప్పలు చెప్పుకుంటున్న గులాబీ నేతలను ఖంగు తినిపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది తామే అనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది నుంచి చెప్పుకుంటున్నప్పటికీ ప్రజలు మాత్రం ఆ క్రెడిట్‌ను కేసీఆర్‌కే ఇచ్చారు. తొలి రెండు సార్లూ కేసీఆర్‌నే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టారు.
జూబ్లీహిల్స్ ( Jubilee Hills ) అభ్యర్థుల భవితవ్యం ఇంకా తేలలేదు. ఈ నియోజకవర్గ కౌంటింగ్‌పై ఉత్కంఠత కొనసాగుతోంది. 45 ఈవీఎంల సీల్ తొలగించారంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ( Azharuddin ) ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి అజారుద్దీన్ నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో ఓటమికి కారణాలను సమీక్షించుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) తెలిపారు. పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ ( BRS ) గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
పటాన్‌చెరు ఎన్నికల రిజల్ట్స్‌కి ( Patancheru Election Results ) బ్రేక్ పడింది. 23వ రౌండ్ కౌంటింగ్‌ని అధికారులు నిలిపివేశారు. రీ కౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) పట్టుబడుతున్నారు. ఎన్నికల అధికారులు, ఆర్వోతో కాట శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. కౌంటింగ్ కేంద్రానికి మహిపాల్‌రెడ్డి ( Mahipal Reddy ), కాట శ్రీనివాస్ వర్గీయులు భారీగా చేరుకున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ ఆశ్చర్యకర ప్రదర్శన చేసింది. బీజేపీ తరఫున పోటీ చేసిన ముఖ్య అభ్యర్థుల్లో చాలా మంది ఓడిపోయారు. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటిన బీఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆశించిన స్థాయిలో సీట్లు సంపాదిస్తుందనుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కేసీఆర్ హ్యాట్రిక్ ఆశలపై కాంగ్రెస్ నీళ్లు జల్లింది. స్పష్టమైన మెజారిటీ సాధించి గులాబీ పార్టీని ఇంటికి పంపించింది. కొన్ని నెలల క్రితం మూడో స్థానానికే పరిమితమైన పార్టీ ఇప్పుడు ఏకంగా అధికారం సాధించింది.
రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డానికి మూల కారకుడు.. ఆయన తెలంగాణ జాతి పిత.. ఆయనకు సరితూగే మరో నాయకుడు తెలంగాణలోనే లేరు.. గులాబీ నేతలే కాదు.. చాలా మంది ఎన్నికల విశ్లేషకులు కూడా అలాగే అనుకున్నారు.
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ( DGP Anjani Kumar )పై కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ డీజీపీని సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. ఇదే అశంపై అదనపు డీజీలు సందీప్‌కుమార్ జైన్, మహేశ్‌భగవత్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.