KTR : ఈ ఎన్నికల్లో ఓటమిపై మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..?
ABN , First Publish Date - 2023-12-03T19:37:55+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో ఓటమికి కారణాలను సమీక్షించుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) తెలిపారు. పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ ( BRS ) గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో ఓటమికి కారణాలను సమీక్షించుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) తెలిపారు. పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ ( BRS ) గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ మేము ఆశించిన ఫలితం రాలేదు. 39 స్థానాలతో ప్రతిపక్ష పాత్రను పోషించాలని ప్రజలు చెప్పారు. ప్రజలు అందించిన తీర్పును శిరసావహిస్తాము. బీఆర్ఎస్ పార్టీ అనేక ఎత్తుపల్లాలను చవిచూసింది. అనుకున్న తెలంగాణను సాధించాము. 39 సీట్లు కార్యకర్తల శ్రమతోనే వచ్చాయి. ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా పని చేస్తాము. ప్రభుత్వం నడిపే వారు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటం చేస్తున్నాము. రాజకీయాల్లో సహనం అవసరం. ప్రజల మన్నన పొందే విధంగా బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుంది. రాజకీయాల్లో గెలుపు,ఓటములు సహజం’’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు
‘‘ఈ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇస్తాము. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడవద్దు. హైదరాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడింది. ఈ ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసి పూర్వ వైభవం సాధిద్దాము. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతి జిల్లాలో ప్రజలు ప్రాతినిధ్యం కల్పించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా కేసీఆర్ రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు’’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.