Home » Exams
నీట్ పరీక్ష వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు తక్షణం స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
'నీట్' పరీక్షల విషయంలో తలెత్తిన వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారంనాడు స్పందించారు. పరీక్షల్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
నీట్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినందుకు ఒక్కో అభ్యర్థి వద్దా రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల దాకా వసూలు చేశారు. ఆ ప్రశ్నలకు జవాబులు బట్టీపట్టించేందుకు వారిని రహస్య ప్రదేశాలకు తరలించారు. పేపర్ లీకయిన విషయం బయటపడకుండా ఉండేందుకు వారిని
లాసెట్ ఫలితాలను ఈ నెల 13వ తేదీన విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
గ్రూప్-1 మెయిన్ పరీక్షలను అక్టోబరు 21 నుంచి 27 దాకా.. వరుసగా ఏడు రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అధికారులు నిర్ణయించారు. రోజూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల దాకా పరీక్షలు జరుగుతాయి.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2024) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను బుధవారం సీఎం రేవంత్రెడ్డి విడుదల చేశారు. పేపర్-1లో 67.13ు, పేపర్-2లో 34.18ు మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో మే 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) పద్ధతిలో టెట్ను నిర్వహించారు.
వైద్య విద్యకు సంబంధించి ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ ఈ ఏడాది ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. నీట్ -2024పై దేశ వ్యాప్తంగా జరుగుతున్న రగడే ఇందుకు కారణం. నీట్ మార్కులపై ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది.
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) పరీక్షల షెడ్యూల్ను టీఎస్పీఎస్సీ(TSPSC) విడుదల చేసింది. పరీక్షలు అక్టోబర్ 21నుంచి 27వరకు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్-యూజీ పరీక్షల్లో నేషనల్ టెస్టింగ్ అథారిటీ (ఎన్టీఏ) గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మరో రిట్ పిటిషన్ దాఖలయింది. సమయాన్ని నష్టపోయారన్న (‘లాస్ ఆఫ్ టైమ్’) కారణం చూపించి ఎన్టీఏ 1,536 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తును తుది దశకు తెచ్చింది. ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నట్టు ప్రకటించింది.