Share News

JEE Main 2025: జేఈఈ మెయిన్‌ రెండో దశ పరీక్షలు

ABN , Publish Date - Apr 04 , 2025 | 05:05 AM

జేఈఈ మెయిన్‌-2025 రెండో దశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. రెండో రోజు గురువారం రెండు షిఫ్టుల్లో పరీక్ష జరిగింది.

JEE Main 2025: జేఈఈ మెయిన్‌ రెండో దశ పరీక్షలు

  • గణితం కఠినం.. ఫిజిక్స్‌ ఓ మాదిరి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్‌-2025 రెండో దశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. రెండో రోజు గురువారం రెండు షిఫ్టుల్లో పరీక్ష జరిగింది. మొదటి షిఫ్ట్‌లో జరిగిన పరీక్ష కొంత కఠినంగా ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఈ సబ్జెక్టులో అన్ని టాపిక్స్‌ బాలెన్స్‌డ్‌గా కవర్‌ చేసినప్పటికీ మెకానిక్స్‌, ఎలక్ర్టోస్టాటిక్స్‌, ఆప్టిక్స్‌, యూనిట్స్‌ అండ్‌ మెజర్‌మెంట్స్‌ అంశాలపై కొంచెం ఎక్కువ ప్రశ్నలు కనిపించాయని, ఫిజిక్స్‌ ఓ మాదిరిగా ఉందని తెలిపారు. మేథ్స్‌ కొంచెం కఠినంగా ఉండడంతో సమాధానాలు రాబట్టడానికి ఎక్కువ సమయం పట్టిందని కొందరు విద్యార్థులు అన్నారు. బుధవారం కెమిస్ట్రీ కష్టంగా ఉండగా, గురువారం వచ్చిన ప్రశ్నలు సులువుగా ఉన్నాయని అన్నారు.


ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, ఫిజికల్‌ కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని, చాలా వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచి నేరుగా అడిగారని తెలిపారు. ఇక గురువారం మొదటి షిప్ట్‌తో పోలిస్తే రెండో షిప్ట్‌ పరీక్ష కొంత సులభంగా ఉన్నట్లు విద్యార్థులు తెలిపారు. కొన్ని ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ దాటి వచ్చినట్లు అనిపించిందని వారు తెలిపారు. ఉదయం సెషన్‌తో పోలిస్తే మధ్యాహ్నం సెషన్‌ వారికి కొంత ఎడ్జ్‌ ఉండే అవకాశం ఉందని కోచింగ్‌ నిపుణులు తెలిపారు. మొత్తంగా చూస్తే లెక్కలు, భౌతికశాస్త్రం నుంచి వచ్చిన ప్రశ్నలు విద్యార్థులను కొంత ఇబ్బంది పెట్టాయని జేఈఈ ఫ్యాకల్టీ చెప్పారు.


హాల్‌టికెట్ల విడుదల

ఏప్రిల్‌ 7, 8, 9 తేదీల్లో జరగనున్న జేఈఈ మెయిన్‌ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసింది. పరీక్ష రాసే అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవ చ్చని తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..

వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఓకే

For More AP News and Telugu News

Updated Date - Apr 04 , 2025 | 05:05 AM