Medical Exam Malpractice: ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్
ABN , Publish Date - Apr 10 , 2025 | 05:47 AM
ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఆకస్మిక తనిఖీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది

అమరావతి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీ కొడుతూ ముగ్గురు విద్యార్థులు పట్టుబడ్డారు. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో బుధవారం ఎంబీబీఎస్ చివరి ఏడాది జనరల్ మెడికల్, ఎంబీబీఎస్ రెండో ఏడాది ఫార్మకాలజీ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ముగ్గురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు. వారిపై చర్యలు తీసుకునేందుకు వర్సిటీ అధికారులు సిద్ధం అవుతున్నారు. కాపీ కొడుతూ దొరికిన వారిలో మంగళగిరిలోని ప్రముఖ మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థులు, ఇబ్రహీంపట్నంలోని మరో మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థి ఉన్నట్లు తెలుస్తోంది.
Read Latest AP News And Telugu News