AP Tenth Social Exam: టెన్త్ సోషల్ పరీక్ష యథాతధం
ABN , Publish Date - Apr 01 , 2025 | 06:38 AM
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి సోషల్ పరీక్షలకు సంబంధించిన తాజా అప్‌డేట్లు వెలువడ్డాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మార్పులు, తేదీలు వెల్లడించబడ్డాయి

ఐచ్ఛిక సెలవు వర్తించదు
పదో తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష మంగళవారం (నేడు) యథావిధిగా జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు స్పష్టం చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష నిర్వహణపై ఎలాంటి అపోహలు లేకుండా సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ విషయాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆర్జేడీలు, డీఈవోలను ఆదేశించారు. రంజాన్ పండగ సందర్భంగా మంగళవారం ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్ఛిక సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు స్పష్టతనిచ్చారు.