Bengaluru: దేవుడా.. ఓ మంచి దేవుడా.. పాస్ మార్కులు వచ్చేలా చూడు సామీ
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:52 PM
దేవుడా.. ఓ మంచి దేవుడా.. నాకు పాస్ మార్కులు వచ్చేలా చూడు సామీ.. అంటూ ఓ విద్యార్థి తన కోరికల చిట్టాను ఓ పేపర్ పై రాసి దాన్ని హుండీలో వేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- ఓ విద్యార్థి విచిత్ర కోరిక
- హుండీలో చీటీ
బెంగళూరు: పరీక్షా కాలం సాగుతోంది. సాధారణంగా పరీక్షలు రాసేవారిలో కొందరు విద్యార్థులు ఎక్కువ మార్కులు వచ్చేలా చూడాలని ఆన్సర్‌షీట్‌లలో రాయడం వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ పదో తరగతి విద్యార్థి హొలమగ్గి హొర బొబ్బరి దేవస్థానం హుండీలో వేసిన చీటీ ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. నాకు ఎక్కువమార్కులు వద్దని, జస్ట్ పాస్ అయ్యే మార్కులు చాలని రాసుకున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: RRTS: మూడు మార్గాల్లో ఆర్‌ఆర్‌టీఎస్ సేవలు
గణితంలో 36-39, ఇంగ్లీష్ లో 37-39, కన్నడలో 39-40, సైన్స్‌లో 38-39, హిందీ లో 39-40, సోషియల్స్టడీస్లో 38-39 మార్కులు వస్తే చాలని రాసుకున్నాడు. దేవుడా ఇంతకంటే తక్కువ మార్కులు రాకుండా చూడుస్వామి అని రాయడం గమనార్హం. సదరు చీటీ నమ్మ కుందాపుర ఫేస్‌బుక్ పేజ్‌లో వైరల్ అయ్యింది. విద్యార్థి పేరు లేకపోవడంతో ఎవరు రాశారనేది తెలియని అంశంగా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
‘పది’ ప్రశ్నపత్రం లీకేజీకి రాజకీయ రంగు
Read Latest Telangana News and National News