Home » Goldsilver Price
దేశంలో గత మూడు రోజులుగా తగ్గిన బంగారం(gold) ధరలకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 12న) ఉదయం 6.15 గంటల నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.71,850కి చేరుకుంది. మరోవైపు వెండి రేట్లు కూడా భారీగా తగ్గాయి.
బంగారం(gold) కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే దేశంలో వరుసగా మూడో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో మరింత చౌకగా మారింది. ఈ క్రమంలో నేడు (జూన్ 11న) 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు 10 గ్రాములకు రూ. 510 తగ్గి రూ.70843కి చేరుకుంది.
దేశంలో గత కొన్ని రోజులుగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధరలు.. రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జూన్ 10న) బంగారం, వెండి రేట్లు స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో ఉదయం 6.20 గంటల నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ. 10 తగ్గగా, ఇక వెండి కూడా కిలోకు రూ. 100 తగ్గింది.
బంగారం(gold), వెండి(silver)ని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. పెద్ద ఎత్తున గోల్డ్, సిల్వర్ ధరలు పడిపోయాయి. ఈ క్రమంలో నేటి(జూన్ 9న) ఉదయం 6.15 గంటల నాటికి గోల్డ్ రేటు రూ.1900 తగ్గగా, మరోవైపు వెండి కూడా రూ.4500 తగ్గింది.
Gold and Silver Rates Today: బంగారం ధరలు(Gold Price) భయపెట్టేస్తున్నాయి.. అమాంతం పెరిగిపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 10 వేలు పెరిగి బెంబేలెత్తించింది. అయితే, రెండు మూడు రోజుల నుంచి బంగారం(Gold) ధర కాస్త అటూ ఇటూగా తగ్గుముఖం పడుతోంది.
బలమైన గ్లోబల్ ట్రెండ్, దేశీయ మార్కెట్‌లో సానుకూల ధోరణుల దృష్ట్యా నేడు(జూన్ 8న) బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా రెండో రోజు కూడా పుత్తడి, వెండి రేట్లు పైపైకి చేరాయి. ఈ క్రమంలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 పెరిగింది.
దేశంలో గత రెండు రోజులుగా తగ్గిన బంగారం(gold), వెండి(silver) ధరలకు మళ్లీ బ్రేక్ పడింది. స్టాక్ మార్కెట్ల సానుకూల ధోరణితో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.700 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.770 పెరిగింది.
బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడతాయని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా నేడు(జూన్ 6న) బంగారం(gold) ధరలు 10 గ్రాములకు 220 రూపాయలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,740కి చేరుకుంది.
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల మధ్య స్టాక్ మార్కెట్లో భారీ సందడి నెలకొంది. స్టాక్ మార్కెట్(stock market)లో రికార్డు పతనం ప్రభావం బంగారం, వెండి ధరలపై కనిపించింది. స్టాక్ మార్కెట్లో గందరగోళం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని(gold) ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
దేశవ్యాప్తంగా నేడు(జూన్ 2న) బంగారం(gold) ధరలు మళ్లీ తగ్గడంతో ఆభరణ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ధరలు తగ్గుముఖం పడతాయని ఎదురుచూస్తున్న వారికి ఈ తగ్గుదల గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.200 తగ్గింది.