Gold and Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. ఏకంగా రూ. 2600..
ABN , Publish Date - Jun 08 , 2024 | 06:29 AM
బలమైన గ్లోబల్ ట్రెండ్, దేశీయ మార్కెట్‌లో సానుకూల ధోరణుల దృష్ట్యా నేడు(జూన్ 8న) బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా రెండో రోజు కూడా పుత్తడి, వెండి రేట్లు పైపైకి చేరాయి. ఈ క్రమంలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 పెరిగింది.
బలమైన గ్లోబల్ ట్రెండ్, దేశీయ మార్కెట్‌లో సానుకూల ధోరణుల దృష్ట్యా నేడు(జూన్ 8న) బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా రెండో రోజు కూడా పుత్తడి, వెండి రేట్లు పైపైకి చేరాయి. ఈ క్రమంలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.20 గంటల నాటికి 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 67,760కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,910కి చేరుకుంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 67,610కి చేరుకోగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 73,760కి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్ రేట్ల వివరాల గురించి తెలుసుకుందాం.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (22 క్యారెట్లు, 10 గ్రాములకు)
ఢిల్లీలో రూ. 67,760
హైదరాబాద్‌లో రూ. 67,610
విజయవాడలో రూ. 67,610
చెన్నైలో రూ. 68,410
బెంగళూరులో రూ. 67,610
అహ్మదాబాద్‌లో రూ. 67,660
కేరళలో రూ. 67,610
కోల్‌కత్తాలో రూ. 67,610
పూణెలో రూ. 67,610
వెండి ధరలు
మరోవైపు వెండి ధరలు కూడా బలపడి కిలోకు ఏకంగా రూ. 2600 పెరిగాయి. ఈ క్రమంలో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 96,100, హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి రేటు రూ. 100,600, ముంబైలో కిలో వెండి ధర రూ. 96,100, చైన్నైలో కిలో వెండి ధర రూ. 100,600, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 96,100, కేరళలో కిలో వెండి ధర రూ. 100,600, బెంగళూరులో కేజీ వెండి రేటు రూ.93,350కు చేరుకుంది.
అలర్ట్: ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.
ఇది కూడా చదవండి:
RBI Rates : ఎనిమిదోసారీ అదే రేటు
RBI : మార్కెట్‌కు ఆర్‌బీఐ బూస్ట్
For Latest News and Business News click here