Gold Silver Price Today: హమ్మయ్య.. ఊరటనిచ్చిన బంగారం, వెండి ధరలు.. నేడు రేట్లు ఇవీ..
ABN , Publish Date - Apr 25 , 2024 | 07:46 AM
Gold and Silver Rates Today: బంగారం ధరలు(Gold Price) భయపెట్టేస్తున్నాయి.. అమాంతం పెరిగిపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 10 వేలు పెరిగి బెంబేలెత్తించింది. అయితే, రెండు మూడు రోజుల నుంచి బంగారం(Gold) ధర కాస్త అటూ ఇటూగా తగ్గుముఖం పడుతోంది.
Gold and Silver Rates Today: బంగారం ధరలు(Gold Price) భయపెట్టేస్తున్నాయి.. అమాంతం పెరిగిపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 10 వేలు పెరిగి బెంబేలెత్తించింది. అయితే, రెండు మూడు రోజుల నుంచి బంగారం(Gold) ధర కాస్త అటూ ఇటూగా తగ్గుముఖం పడుతోంది. ఇక ఇవాళ్టి ధరల విషయానికి వస్తే(గురువారం ఉదయం 6 గంటల సమయానికి) బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల మేలిమి బంగారంపై ధర రూ. 10 పెరిగింది. దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో(Indian Markets) 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 72,660 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 66,610 పలుకుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..
తెలంగాణ(Gold Price in Telangana), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో(Gold Pirce in Andhra Pradesh) బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. హైదరాబాద్(Gold Price in Hyderabad) 22 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ. 66,610 గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 72,660 గా ఉంది. విజయవాడలో(Gold Price in Vijayawada) 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,610 పలుకుతుండగా.. 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ. 72,660 గా ఉంది.
ఇదికూడా చదవండి: ఎల్‌ఐసీ పేరుతో నకిలీ ప్రకటనలు... తస్మాత్ జాగ్రత
దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఏ ప్రాంతంలో ఎలా ఉందో ఒకసారిచూద్దాం..
నగరం | 22 క్యారెట్స్ | 24 క్యారెట్స్ |
చెన్నై | 67,310 | 73,430 |
ముంబై | 66,610 | 72,660 |
ఢిల్లీ | 66,760 | 72,810 |
కోల్‌కతా | 66,610 | 72,660 |
బెంగళూరు | 66,610 | 72,660 |
హైదరాబాద్ | 66,610 | 72,660 |
విజయవాడ | 66,610 | 72,660 |
పూణె | 66,610 | 72,660 |
అహ్మదాబాద్ | 66,660 | 72,710 |
మదురై | 67,310 | 73,430 |
నాగ్‌పూర్ | 66,610 | 72,660 |
ఇదికూడా చదవండి: కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్‌బీఐ కొరడా
స్వల్పంగా తగ్గిన వెండి ధరలు..
వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కేజీ వెండిపై రూ. 100 తగ్గింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 82,800 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ. 82,800గా ఉంది. ముంబైలో కేజీ వెండి ధర రూ. 82800గా ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 86,300 పలుకుతోంది. విజయవాడలో రూ. 86,300, విశాఖపట్నంలో 86,300, వరంగల్‌లో రూ. 86,300 గా ఉంది.