Gold and Silver Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా మూడోసారి తగ్గిన బంగారం
ABN , Publish Date - Jun 11 , 2024 | 06:31 AM
బంగారం(gold) కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే దేశంలో వరుసగా మూడో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో మరింత చౌకగా మారింది. ఈ క్రమంలో నేడు (జూన్ 11న) 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు 10 గ్రాములకు రూ. 510 తగ్గి రూ.70843కి చేరుకుంది.
బంగారం(gold) కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే దేశంలో వరుసగా మూడో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టడంతో మరింత చౌకగా మారింది. ఈ క్రమంలో నేడు (జూన్ 11న) ఉదయం 6.20 గంటల నాటికి 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ. 510 తగ్గి రూ.70843కి చేరుకుంది. మరోవైపు ఇదే సమయంలో వెండి(silver) రేట్లు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధర రూ. 400 పెరిగి రూ.96,300కు చేరుకుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కీలక నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల గురించి ఇక్కడ చుద్దాం.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (24 క్యారెట్ల 10 గ్రాములకు)
హైదరాబాద్‌లో రూ. 71,660
విజయవాడలో రూ. 71,660
ఢిల్లీలో రూ. 71,180
ముంబైలో రూ. 71,660
చెన్నైలో రూ. 72,320
కోల్‌కతాలో రూ. 71,660
బెంగళూరులో రూ. 71,660
కేరళలో రూ. 71,660
వడోదరలో రూ. 71,170
ప్రధాన నగరాల్లో వెండి రేట్లు (కిలోకు)
హైదరాబాద్‌లో రూ. 96,300
విజయవాడలో రూ. 96,300
ఢిల్లీలో రూ. 91,800
బెంగళూరులో రూ. 90,300
కేరళలో రూ. 96,300
పూణేలో రూ. 91,800
వడోదరలో రూ. 91,800
చెన్నైలో రూ. 96,300
అహ్మదాబాద్‌లో రూ. 91,800
లక్నోలో రూ. 91,800
గమనిక: బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచన.
ఇది కూడా చదవండి:
SEBI : మరింత కట్టుదిట్టంగా డెరివేటివ్స్ మార్కెట్
iPhones : ఐఫోన్లకూ జనరేటివ్ ఏఐ టెక్నాలజీ హంగులు
For Latest News and Business News click here