Home » Gujarat
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గుజరాత్ లోని గాంధీనగర్‌లో ఆదివారం జరిగిన ఉత్తరాయణ్ పతంగ్ మహోత్సవ్‌లో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా పతంగం ఎగురవేశారు. అహ్మదాబాద్‌లోని జగన్నాథ స్వామి ఆలయాన్ని సైతం దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు.
భారత్(Bharat) నుంచి అగ్రరాజ్యం అమెరికా(America)కు అక్రమంగా వెళ్లే(Illegal Migration) వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే గత నెలలో నికరాగ్వాకు అక్రమంగా భారతీయులతో వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుజరాత్ నుంచి మెక్సికో సరిహద్దుల గుండా 60 మందికి పైగా అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించారని అధికారులు తెలిపారు.
ప్రధాని మోదీ(PM Modi) స్వరాష్ట్రం గుజరాత్ కు పెట్టుబడులు వరద కొనసాగుతోంది. టాప్ బిలీయనీర్ అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gowtham Adani) తన భారీ పెట్టుబడి ప్రణాళికను బుధవారం వివరించారు. ఆయన కంపెనీలు గుజరాత్లో 2025వరకు రూ.55 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
భారతదేశాన్ని 2024 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్లో పదవ ''వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్''ను ప్రధాన మంత్రి బుధవారంనాడు ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటన కోసం సోమవారం రాత్రి ఆయన అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మోదీనే తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.
శ్రీకృష్ణ భగవానుడు కొలువైన ద్వారకను భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శనివారంనాడు దర్శించుకున్నారు. ద్వారకాధీశుని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పసుపు రంగు దుస్తులు ధరించి సతీ సమేతంగా ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. సీజేఐ రాక సందర్భంగా ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
‘ఏదైనా నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్’ అనే సినిమా డైలాగ్ మన భారతీయులకు సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఎందుకంటే.. మనోళ్లు ఏదైనా...
గుజరాత్లో అహిర్ కమ్యూనిటీకి చెందిన దాదాపు 37,000 మంది మహిళలు శ్రీ కృష్ణుడిపై తమ భక్తిని చాటుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి శ్రీకృష్ణుని విగ్రహం చుట్టూ పెద్ద ఎత్తున నృత్యాలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు గుజరాత్‌లోని సూరత్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్నారు. ఉదయం 10:45 గంటలకు సూరత్ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తారు.
నూతనంగా అభివృద్ధి చేసిన సూరత్ డైమండ్ బోర్స్‌ను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయమై ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటన కూడా చేసింది.