Home » Gyanvapi case
జ్ఞానవాపి మసీదుపై శాస్త్రీయ సర్వే నివేదికను భారత పురావస్తు శాఖ సోమవారంనాడు వారణాసి జిల్లా కోర్టుకు సమర్పించింది. సీల్డ్ కవర్‌లో ఈ నివేదికను అర్కియాలజికల్ సర్వే స్టాండింగ్ కౌన్సిల్ అమిత్ శ్రీవాత్సవ అందజేశారు.
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్ శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించేందుకు మరో 21 రోజులు గడువు కావాలని భారత పురావస్తు శాఖ వారణాసి జిల్లా కోర్టును కోరింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28వ తేదీన నివేదికను ఏఎస్ఐ సమర్పించాల్సి ఉంది.
ఉత్తర ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India-ASI) సైంటిఫిక్ సర్వే రెండో రోజు శనివారం ఉదయం పునఃప్రారంభమైంది. ఈ సర్వేకు ముస్లిం పక్షం కూడా హాజరైంది. ఏఎస్ఐ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి సర్వే చేస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India-ASI) శుక్రవారం ఉదయం ప్రారంభించింది. 17వ శతాబ్దంనాటి ఈ మసీదును అంతకన్నా ముందే నిర్మించిన హిందూ దేవాలయంపైన నిర్మించారా? అనే అంశాన్ని నిర్థరించేందుకు ఈ సర్వే జరుగుతోంది.
జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. వాస్తవాలు బయటపడాలంటే సర్వే అవసరమని తెలిపింది. అంజుమన్ ఇంతెజామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. సర్వేకు అనుకూలంగా జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో హిందూ పక్షం ‘‘హర హర మహాదేవ్’’ అంటూ నినాదాలు చేస్తూ, సంతోషం వ్యక్తం చేసింది.
వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో త్రిశూలం ఉండటాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. అది మసీదే అయితే అక్కడ త్రిశూలం ఎందుకుంది? అని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.
జ్ణానవాపి మసీదుపై ఏఎస్‌ఐ సర్వేపై 26వ తేదీ వరకూ సుప్రీంకోర్టు స్టే విధించింది. సర్వేపై జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై బుధవారం సాయంత్రం 5గంటల వరకూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ప్రతివాదుల వాదన వినేంతవరకూ స్టే విధించాలని తాము భావిస్తున్నామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. వారణాసి కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించాలని మసీద్ కమిటీకి సుప్రీం సీజేఐ ధర్మాసనం సూచించింది.
కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకున్న ఉన్న జ్ఞానవాపి మసీదు కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ సైంటిఫిక్ సర్వే కు వారణాసి కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. వివాదాస్పద "శివలింగం'' జోలికి వెళ్లకుండా కాంప్లెక్‌లో భారత పురావస్తు శాఖ సైంటిఫిక్ సర్వే జరపవచ్చని తెలిపింది.
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి శృంగార గౌరి ఇతర దేవీదేవతలకు నిత్యం పూజలు చేసేందుకు
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు-శృంగార గౌరి ఆరాధన వివాదంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని