Home » HMDA
నగరంలో ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు మొదలవుతున్న మెట్రో రైళ్లు రాత్రి 11.15 గంటల వరకు నడుస్తున్నాయి. కాగా, ప్రతీ సోమ, శుక్రవారాల్లో ఉదయం 5.30 గంటలకు ప్రారంభమై రాత్రి 12.45 గంటల వరకు తిరుగుతున్నాయి. ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోల్-రాయదుర్గం కారిడార్లలోని 57 స్టేషన్ల పరిధిలో రోజుకు 1028 మెట్రో ట్రిప్పులను నడిపిస్తున్నారు.
జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ వరకు పరిధి.. దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్లు.. 27 మునిసిపాలిటీలు, 33 పంచాయతీలు..! స్వయంప్రతిపత్తితో విధి నిర్వహణతో.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) పేరిట మహా నగరంలో కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
హైదరాబాద్: మియాపూర్ హెచ్ఎండిఏ వివాదాస్పద ల్యాండ్‌లో పోలీసులు డ్రోన్‌తో గస్తీ కాస్తున్నారు. ల్యాండ్ చుట్టూ పక్కల ఏవరైనా ఆందోళన కారులు ఉన్నారా? లేరా? అని తెలుసుకుంటున్నారు. మరోవైపు పోలీసుల పహారా కొనసాగుతోంది. ఎవరూ ల్యాండ్ వద్దకు రాకుండా ఉండేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు.. ఆదాయ పరంగా బంగారు బాతు అన్నది స్పష్టమవుతోంది. ఔటర్‌పై రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీతో ఆదాయం భారీగా పెరుగుతోంది. ప్రతి నెలా హెచ్ఎండీఏ అధికారులు ఊహించని స్థాయిలో రాబడి వస్తోంది.
బహుళ అంతస్తుల భవనాలు, గోడౌన్లు, పెట్రోల్ బంక్‌లు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం, లేఅవుట్ ఏర్పాటు.. వీటీల్లో దేనికైనాసరే హెచ్ఎండీఏ ఇకపై ఆన్లైన్లోనే అనుమతులు జారీ చేయనుంది. కొన్ని అనుమతులు ఆన్లైన్లో మరికొన్ని అనుమతులు ఆఫ్‌లైన్‌లో జారీ చేసే గత విధానానికి పూర్తిగా స్వస్తి పలికింది.
పురపాలక శాఖ పరిధిలోని పలు విభాగాల్లో సిబ్బంది కొరత అధికంగా ఉంది. దీని వల్ల డిప్యుటేషన్లపై ఆధారపడి పనులు చేయాల్సిన పరిస్థితి. పురపాలక శాఖ సంచాలకుల పరిధి(సీడీఎంఏ), హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు, మూసీ అభివృద్ధి మండలి, హెచ్ఎండీఏ, టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్, రెరా విభాగాల్లో సిబ్బంది కొరత ఉన్నట్లు ఆయా విభాగాల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
నార్సింగి మున్సిపాల్టీలోని అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం మోపింది. కోకాపేట గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను హెచ్ఎండీఏ, మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా భవన యజమానులు జీ ప్లస్ 3 అనుమతులు తీసుకొని ఆరు అంతస్థులు నిర్మించారు.
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్లకు భూసేకరణ ప్రక్రియ షురూ అయ్యింది. ఓ వైపు సికింద్రాబాద్ నుంచి 44వ జాతీయ రహదారి మీదుగా కండ్లకోయ వరకు, మరోవైపు సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట వైపు వచ్చే ఈ ఎలివేటెడ్ కారిడార్లకు రక్షణ శాఖ భూములే కీలకంగా మారాయి.
అనతికాలంలోనే మెట్రోరైలు(Metro Rail) అమిత ప్రజాదరణ పొందింది. ట్రాఫిక్, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తూ విభిన్నవర్గాలకు చేరువైంది. మెరుగైన రవాణాను అందిస్తోంది. తొలిరోజుల్లో సగటున 1.60 లక్షల నుంచి 2.10 లక్షల మంది రాకపోకలు సాగించగా, ప్రస్తుతం 4.80 లక్షల నుంచి 5.10 లక్షల వరకు ప్రయాణిస్తుండడం ఆసక్తికరంగా మారింది.
ఉద్దేశపూర్వకంగా నీటి సరఫరాలో ఆటంకాలు కల్పించే సిబ్బందిని విధుల నుంచి తప్పిస్తామని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్(Municipal Department Chief Secretary M. Danakishore) హెచ్చరించారు. నగరంలో తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఉండకూడదని వాటర్‌బోర్డు అధికారుల్ని ఆదేశించారు.