Hyderabad: దూసుకుపోతున్న ‘మెట్రో’.. రికార్డుసాయిలో ప్రయాణికులు
ABN , Publish Date - May 04 , 2024 | 10:20 AM
అనతికాలంలోనే మెట్రోరైలు(Metro Rail) అమిత ప్రజాదరణ పొందింది. ట్రాఫిక్, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తూ విభిన్నవర్గాలకు చేరువైంది. మెరుగైన రవాణాను అందిస్తోంది. తొలిరోజుల్లో సగటున 1.60 లక్షల నుంచి 2.10 లక్షల మంది రాకపోకలు సాగించగా, ప్రస్తుతం 4.80 లక్షల నుంచి 5.10 లక్షల వరకు ప్రయాణిస్తుండడం ఆసక్తికరంగా మారింది.
- కారిడార్లలో క్రమేపీ పెరుగుతున్న రద్దీ
- ఒక్క ఎల్బీనగర్‌లోనే రోజుకు 50 వేల మంది
హైదరాబాద్ సిటీ: అనతికాలంలోనే మెట్రోరైలు(Metro Rail) అమిత ప్రజాదరణ పొందింది. ట్రాఫిక్, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తూ విభిన్నవర్గాలకు చేరువైంది. మెరుగైన రవాణాను అందిస్తోంది. తొలిరోజుల్లో సగటున 1.60 లక్షల నుంచి 2.10 లక్షల మంది రాకపోకలు సాగించగా, ప్రస్తుతం 4.80 లక్షల నుంచి 5.10 లక్షల వరకు ప్రయాణిస్తుండడం ఆసక్తికరంగా మారింది.
ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో సుమారు రూ.14,132 వేల కోట్ల వ్యయంతో మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు. 2017 నవంబర్ నుంచి ఎల్‌బీనగర్-మియాపూర్(LBnagar-Miyapur), జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోలు-రాయదుర్గం కారిడార్ల పరిధిలోని 69.2 కిలోమీటర్ల మార్గంలో రైళ్లు నడుస్తున్నాయి. ఆరంభంలో హైదరాబాద్ మెట్రోరైలు అధికారులు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్‌అండ్‌టీ అధికారులు తీవ్రంగా కృషి చేసి ఆయా కారిడార్లలో పిల్లర్ల నిర్మాణానికి కావాల్సిన ఆస్తుల సేకరణకు పకడ్బందీగా చేశారు. సమర్థవంతంగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి వచ్చారు.
ఇదికూడా చదవండి: రోహిత్ వేముల కేసులో నిందితులకు క్లీన్‌చిట్
రోజురోజుకూ ఆదరణ
మెట్రోరైళ్లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతున్న రైళ్లు రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా నడుస్తూ అన్ని వర్గాల ప్రజలకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రతి 3 నుంచి 6 నిమిషాలకోసారి రైలు వస్తుండడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొవిడ్ కాలంలో ప్రయాణికుల సంఖ్య కొంతమేరకు తగ్గినా మళ్లీ పుంజుకుంది.
కారిడార్-1లోని ఎల్‌బీనగర్‌లో రోజుకు 40 నుంచి 50 వేల మంది, కారిడార్ 3లోని రాయదుర్గంలో 35 నుంచి 40 వేల మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కారిడార్-2 జేబీఎ్‌స-ఎంజీబీ ఎస్‌లో తక్కువ మొత్తంలో ఉంటున్నారని, ఈ మార్గంలో రోజులో గరిష్ఠంగా 25 వేలు దాటడంలేదని పేర్కొంటున్నారు. వచ్చే మూడేళ్లలో 80 కోట్ల మందికి చేరేందుకు ప్రయత్నిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇదికూడా చదవండి: former CM KCR : తొండి చేసేటోళ్లే ఒట్లు పెట్టుకుంటరు!
మెట్రో రైళ్లలో ప్రయాణికులు
సంవత్సరం సంఖ్య
2017 34.05 లక్షలు
2018 3.44 కోట్లు
2019 9.02 కోట్లు
2020 3.04 కోట్లు
(కొవిడ్ కాలం)
2021 5.01
కోట్లు(కొవిడ్ కాలం)
2022 11.02 కోట్లు
2023 15.80 కోట్లు
2024 ఫిబ్రవరి 2 వరకు మొత్తం 50.00 కోట్లు
2024 ఫిబ్రవరి 3 నుంచి మే 2 వరకు 5.04 కోట్లు
ఇధికూడా చదవండి: Hyderabad: మొదలైన హోం ఓటింగ్.. మొదటి రోజు నగరంలో ఇంటి వద్దే ఓటేసిన 177 మంది
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News