Hyderabad: మెట్రో రైళ్లపై ఎల్‌అండ్‌టీ దృష్టి..
ABN , Publish Date - Jul 21 , 2024 | 11:01 AM
నగరంలో ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు మొదలవుతున్న మెట్రో రైళ్లు రాత్రి 11.15 గంటల వరకు నడుస్తున్నాయి. కాగా, ప్రతీ సోమ, శుక్రవారాల్లో ఉదయం 5.30 గంటలకు ప్రారంభమై రాత్రి 12.45 గంటల వరకు తిరుగుతున్నాయి. ఎల్‌బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోల్-రాయదుర్గం కారిడార్లలోని 57 స్టేషన్ల పరిధిలో రోజుకు 1028 మెట్రో ట్రిప్పులను నడిపిస్తున్నారు.
- సాంకేతిక సమస్యల పరిష్కారానికి కార్యాచరణ
- వర్షాకాలం నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా చర్యలు
హైదరాబాద్ సిటీ: నగరంలో ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు మొదలవుతున్న మెట్రో రైళ్లు రాత్రి 11.15 గంటల వరకు నడుస్తున్నాయి. కాగా, ప్రతీ సోమ, శుక్రవారాల్లో ఉదయం 5.30 గంటలకు ప్రారంభమై రాత్రి 12.45 గంటల వరకు తిరుగుతున్నాయి. ఎల్‌బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోల్-రాయదుర్గం కారిడార్లలోని 57 స్టేషన్ల పరిధిలో రోజుకు 1028 మెట్రో ట్రిప్పులను నడిపిస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్‌లో నడుస్తున్న ఈ రైళ్లకు కావాల్సిన 132 కేవీ లైన్‌తో విద్యుత్ సరఫరాను ట్రాన్స్‌కో నుంచి తీసుకుంటున్నారు. ఈ మేరకు ఉప్పల్, మియాపూర్, యూసుఫ్‌గూడ, ఎంజీబీఎస్(Uppal, Miyapur, Yusufguda, MGBS)లో ఏర్పాటు చేసిన రిసీవింగ్ సబ్‌స్టేషన్లు (ఆర్‌ఎస్ఎస్) ద్వారా తీసుకుని రైళ్ల ఆపరేషన్స్, మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: రోడ్డుపై వరినాట్లతో కౌన్సిలర్ నిరసన..
కాగా, 132 కేవీ సామర్థ్యం కలిగిన లైన్ ద్వారా ఇస్తున్న కరెంట్‌లో 33 కేవీని లైటింగ్, సాధారణ నిర్వహణ పనులకు, సింగిల్ ఫేజ్ ద్వారా ఇస్తున్న 25 కేవీ లైన్ విద్యుత్‌ను ట్రాక్షన్ నిర్వహణకు వాడుకుంటున్నారు. అయితే, ఆయా రకాల విద్యుత్‌ను ఉప్పల్ డిపోలోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల తలెత్తిన అంతరాయాన్ని కూడా ఇక్కడి నుంచే తెలుసుకుని సత్వర చర్యలు చేపట్టారు.
ప్రత్యామ్నాయ చర్యలు..
మెట్రో రైళ్ల రాకపోకలకు అత్యంత ప్రధానమైనది విద్యుత్ వ్యవస్థ. సరఫరా విషయంలో హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ సంస్థలు పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. రైళ్ల రాకపోకలు జరుగుతున్న సమయంలో ఏదైనా కారిడార్‌లో కరెంట్ సమస్య ఏర్పడితే.. వెంటనే సమీపంలోని సబ్‌స్టేషన్ నుంచి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఎంజీబీఎస్‌లో ఇన్‌కమింగ్ ట్రాన్స్‌కో ఫీడర్ పరిధిలోని ఎర్రమంజిల్ స్టేషన్‌లో ట్రిప్పింగ్ సమస్య ఏర్పడితే.. వెంటనే మియాపూర్ మార్గంలోని ప్రత్యామ్నాయ ఫీడర్‌ను అనుసంధానం చేసి ఈ రూట్‌లో 7 నిమిషాల్లో సమస్యను పరిష్కరించారు. విద్యుత్ సరఫరాను 24 గంటలపాటు పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశిస్తున్నారు.
ఇకపై ప్రతీ వారం సమీక్ష
ప్రస్తుతం నగరంలో వర్షాలు కురుస్తుండడంతో సిగ్నలింగ్‌లో సమస్య ఏర్పడి రైళ్లు పట్టాలపై అకస్మాత్తుగా నిలిచిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రివేళలో ఎలివేటెడ్ కారిడార్‌లోని ట్రాక్షన్ వైర్లను పర్యవేక్షించడం, ట్రాక్‌కు సంబంధించిన నట్లు, బోల్టులు సరిచేయడం లాంటివి చేస్తున్నారు. అలాగే, పిల్లర్లు, స్టేషన్ల సమీపంలో పెరిగిన చెట్లకొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశిస్తున్నారు. అయితే, ఆయా విభాగాల పనితీరుపై ప్రతీ వారం సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఏ విభాగానికి సంబంధించిన సమస్య తలెత్తినా దానికి వారిని బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News