Home » IAS
ఐపీఎస్ అధికారుల బదిలీలు ప్రక్రియ ముగియగానే భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను(IAS officers) ప్రభుత్వం బదిలీ చేసింది. పర్యాటకశాఖ, జలమండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రామ్‌ప్రసాత్ మనోహర్‌ను నగరాభివృద్ధి శాఖ అడిషినల్ సెక్రటరీగా బదిలీ చేసింది.
ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే అంత బిజీలోనూ అక్కడ ఉన్న తెలుగు ఐఏఎస్, ఐపీఎస్‌లకు విందు కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. వారితో ముచ్చటించి పలు అంశాలపై చర్చించారు.
ప్రజాపనులు, జలవనరులు, ఆరోగ్య తదితర కీలక శాఖల ఐఏఎస్ అధికారులను రాష్ట్రప్రభుత్వం బదిలీ చేసింది. సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్మీనా జారీచేసిన ప్రకటనలో... రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న కె.మణివాసన్ జలవనరుల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా(Kartikeya Mishra)ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్(CS Neerabh Kumar Prasad) ఆదేశాలు జారీ చేశారు. కార్తికేయ మిశ్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
ధరణి పెండింగ్ దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ధరణిపై ఆయన శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా పెండింగులో ఉన్న దరఖాస్తులను సమీక్షించారు.
నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు శుక్రవారం పదవీ విరమణ చేశారు. మాజీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డితో పాటు పూనం మాలకొండయ్య, కె.వెంకటరమణారెడ్డి, హెచ్.అరుణ్‌కుమార్ రిటైరయ్యారు.
కాశ్.. ఈ పేరు వివాదాలకు కేంద్రం. ఐఏఎస్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన వివాదం లేకుండా పూర్తిచేసిన పోస్టింగ్ ఒక్కటీ లేదు. ఆ వ్యవహార శైలే ఇప్పుడు ఆయన సర్వీసును ముంచింది.
రాష్ట్రంలోని తొమ్మిది మంది జూనియర్ ఐఏఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రొబేషనరీ హోదా’ కల్పించింది. ఈమేరకు వారి సర్వీసులను కన్ఫర్మ్ చేస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజా విజ్ఞప్తులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ భూపిందర్ పాల్ సింగ్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం భారీస్థాయిలో 40 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఒక ఐఎ్‌ఫఎస్ అధికారి, ఒక నాన్-కేడర్ అధికారిని బదిలీ చేసి పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం జీవో (నంబర్ 876) జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెను మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసిన చంద్రబాబు సర్కార్.. తాజాగా