Home » INDIA Alliance
ఇండియా కూటమిని కాంగ్రెస్ అసలు పట్టించుకోవట్లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar)చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) స్పందించారు. కాంగ్రెస్(Congress) పార్టీకి ఇండియా కూటమి కీలకమని ఖర్గే ఉద్ఘాటించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా పార్టీకి ముఖ్యమని.. అందుకే ఇండియా కూటమి(INDIA Alliance) తదుపరి సమావేశం నిర్వహించట్లేదని వ్యాఖ్యానించారు.
ఇండియా కూటమి(INDIA Alliance) లో రివేంజ్ పాలిటిక్స్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో 65 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయని పార్టీ స్ఫష్టం చేసింది.
కాంగ్రెస్ పార్టీ 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు(Lokh Sabha Elections) పూర్తి స్థాయిలో సన్నద్ధత కావట్లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్(Nitish Kumar) విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress) పార్టీ త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టిందని.. దీంతో మొత్తంగా లోక్ సభ ఎన్నికలను విడిచిపెట్టిందని వ్యాఖ్యానించారు.
2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో కొన్ని విపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కూటమి మూడుసార్లు సమావేశం నిర్వహించింది. మధ్యలో అంతర్గత విభేదాలు తలెత్తినా..
ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా బీజేపీపై సంచలన అరోపణలు చేశారు. 2024 ఎన్నికలకు ముందే 'ఇండియా' కూటమి నేతల అరెస్టును బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుందని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో దీనిని మొదలుపెట్టనుందని అన్నారు.
రాజకీయ కూటములను నియంత్రించే చట్టబద్ధమైన అధికారాలు తమకు లేవని ఢిల్లీ హైకోర్టుకు భారత ఎన్నికల కమిషన్ తెలియజేసింది. 26 పార్టీల కూటమికి 'ఇండియా' పేరు పెట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టుకు ఈసీ సోమవారం తమ అభిప్రాయాన్ని తెలియచేసింది.
ఎన్సీఆర్టీ(NCERT)లో పేరు మార్పుపై కొందరు అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మండిపడ్డారు. భారత్, ఇండియా మధ్య తేడా ఏం లేదని.. దీనిపై కొందరు కాంట్రవర్సీ చేస్తున్నారని ఆరోపించారు.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పుస్తకాల్లో ఇండియా(INDIA) అనే పేరు వాడవద్దని ప్యానెల్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇండియా స్థానంలో భారత్ అనే పేరు మాత్రమే వాడాలని మార్గదర్శకాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం.. ఇండియా అంటే భారత్ యూనియన్ అని నిర్వచించింది
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి బీజేపీపై ధ్వజమెత్తారు. దేశ పురోగతికి కేంద్రంలోని బీజేపీ ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించిన ఆయన.. ఇప్పుడు ఆ పార్టీకి ఇండియా కూటమి ప్రత్యామ్నాయంగా..
కాంగ్రెస్ పార్టీపై సమాజ్‌వాది పార్టీ(Samajwadi Party) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఆగ్రహం చల్లారినట్లు లేదు. తాజాగా ఆయన ఆ పార్టీపై చేసిన విమర్శలు ఇండియా కూటమిలో తీవ్ర కల్లోలం రేపుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే కులగణన(Caste Census) చేపడతామంటున్న కాంగ్రెస్(Congress) పార్టీకి ప్రస్తుతం వెనకబడిన కులాలు, తెగల మద్దతు లేదని అఖిలేష్ విమర్శించారు.