Home » India vs West indies
తెలుగు ఆటగాడు తిలక్ వర్మ కెరీర్ అరంగేట్ర మ్యాచ్‌లోనే తన అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ ఫీల్డింగ్ విన్యాసాలు అదిరిపోయాయి.
భారత్‌తో మొదటి టీ20 మ్యాచ్‌లో అతిథ్య వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. అలాగే యువ పేసర్ ముఖేష్ కుమార్ కూడా ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేస్తున్నాడు.
టీమిండియా యువ బ్యాటర్ సంజూ శాంసన్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటివరకు అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 241 మ్యాచ్‌లాడిన సంజూ శాంసన్ 5,979 పరుగులు చేశాడు. దీంతో మరొక 21 పరుగులు చేస్తే టీ20ల్లో 6 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు.
భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. టరుబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓ రికార్డుకు చేరువలో ఉన్నాడు.
మొదటి మ్యాచ్‌తో భారత జట్టు 200 టీ20 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోనుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన జట్టుగా చరిత్ర సృష్టించనుంది. ప్రపంచంలోనే పొట్టి క్రికెట్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పనుంది.
భారత్, వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు పలు రికార్డులను అందుకునే అవకాశాలున్నాయి. మొత్తం ఏడుగురు భారత ఆటగాల్లు ఏడు రికార్డులకు చేరువలో ఉన్నారు.
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వరుసగా పాకిస్థాన్ ఆటగాళ్ల రికార్డులను బద్దలుకొడుతున్నాడు. ఇప్పటికే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును బద్దలు కొట్టిన గిల్.. తాజాగా మరో పాక్ ప్లేయర్ ఇమామ్-ఉల్-హక్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు.
మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. కాకపోతే మరో యువ ఆటగాడి నుంచి తిలక్ వర్మకు గట్టి పోటీ తప్పే అవకాశాలు కనిపించడంలేదు.
రెండు, మూడో వన్డేల్లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మూడో వన్డే మ్యాచ్ అనంతరం పోస్ట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో హార్దిక్ మాట్లాడుతూ.. భారత ఆటగాళ్ల కనీసం అవసరాలను తీర్చడంలో కూడా విండీస్ బోర్డు విఫలమైందని విమర్శలు గుప్పించాడు.
మూడో వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది.