Home » Indian Navy
ఉత్తర అరేబియా సముద్రంలో లైబీరియన్ జెండాతో కూడిన వాణిజ్య నౌక హైజాక్ అయిన క్రమంలో అప్రమత్తమైన భారత నావికాదళం(indian navy) శుక్రవారం వెంటనే రంగంలోకి దిగి వారి చర్యలను కట్టడిచేసింది. అంతేకాదు వారిని సురక్షితంగా రక్షించి తీసుకురాగా..తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో వారు భారత్ మాతా కీ జై అంటు నేవీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
సోమాలియా సరిహద్దులో హైజాక్ కి(Hijacked Cargo Ship) గురైన కార్గో నౌక "ఎంవీలిలా నార్ఫోర్క్"ను ఎట్టకేలకు భారత నేవీ అధికారులు గుర్తించారు. అందులో 15 మంది భారతీయులు ప్రయాణిస్తున్నారని వారు తెలిపారు. వారి జాడ గుర్తించడంతో 15 మంది భారతీయులతోపాటు 21 మంది క్రూ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
టెన్ ప్లస్ టూ(బీ టెక్) కేడెట్ ఎంట్రీ స్కీమ్ కింద ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్ల్లో నాలుగేళ్ల బీటెక్ కోర్సు చేరేందుకు నావికాదళం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 35 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
భారతీయ సిబ్బందితో కూడిన ఓ నౌక హైజాక్ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 5 మంది సిబ్బందితో లైబీరియన్ జెండాతో కూడిన ఓడను సోమాలియా(Somalia) తీరానికి సమీపంలో హైజాక్(Ship Hijack) చేశారు.
15 మంది భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న షిప్ హైజాక్ అయ్యిందని నేవీ అధికారులు పేర్కొన్నారు. లైబీరియన్ జెండాతో కూడిన ఓడ సోమాలియా తీరం సమీపంలో హైజాక్ చేయబడింది చెప్పారు.
అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ‘ఎంవీ కెమ్ ప్లూటో’పై డ్రోన్ దాడి నేపథ్యంలో భారత నేవీ కీలక చర్యకు ఉపక్రమించింది. అరేబియా సముద్రంలో మూడు యుద్ధ నౌకలను మోహరించింది. అంతేకాకుండా సముద్ర గస్తీ కోసం పీ-8ఐ లాంగ్-రేంజ్ పెట్రోల్ విమానాన్ని విమానాన్ని కూడా రంగంలోకి దించింది. యుద్ధనౌకలు ఐఎన్ఎస్ మోర్ముగావ్, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్కతాలను మోహరించామని నేవీ అధికారిక ప్రకటన విడుదల చేశారు.