Massive Drug Seizure: పశ్చిమ తీరంలో 2,500 కిలోల డ్రగ్స్ జప్తు
ABN , Publish Date - Apr 03 , 2025 | 03:24 AM
భారత నౌకాదళం పశ్చిమ హిందూ మహాసముద్రంలో 2,500 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఆపరేషన్‌లో ఐఎన్‌ఎస్ తర్కాష్ కీలక పాత్ర పోషించింది

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: దేశంలో మరోసారి భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టైంది. ఇండియన్ నేవీ స్పెషల్ ఆపరేషన్‌లో భాగంగా 2,500 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. భార త నావికాదళానికి చెందిన ఫ్రంట్‌లైన్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎ్‌స తర్కాష్ నౌక ఈ ఆపరేషన్‌లో కీలకపాత్ర పోషించింది. గత నెల 31న భారత పశ్చిమ హిందూ మహాసముద్రంలో అనుమానాస్పద కదలికలపై భారత నౌకాదళానికి సమాచారం అందిందని నేవీ అధికారులు వెల్లడించారు. పీ8ఐ అనే సముద్ర నిఘా విమానాన్ని రంగంలోకి దించి, ముంబైలోని మారిటైమ్ ఆపరేషన్ సెంటర్ సమన్వయంతో ఐఎన్‌ఎ్‌స తర్కాష్ ఓ అనుమానాస్పద నౌకను అడ్డుకున్నట్లు తెలిపారు. నౌకాదళ ప్రత్యేక బృందంతో కలిసి సముద్ర కమాండోలు అనుమానిత నౌకలో తనిఖీ చేయగా మాదకద్రవ్యాల ప్యాకెట్లను గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరి తనిఖీల్లో మొత్తం 2,500 కిలోలకు పైగా మత్తు పధార్థాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇందులో 2,386 కిలోల హషిష్, 121 కిలోల హెరాయిన్ ఉందన్నారు. ఈ నేపథ్యంలో అనుమానిత నౌకను ఐఎన్‌ఎస్ తర్కాష్ నియంత్రణలోకి తీసుకున్నట్లు, డ్రగ్స్ అక్రమ రవాణా గురించిన సమాచారాన్ని షిప్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Waqf Amendment Bill: వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోండి..ప్రధానికి స్టాలిన్ లేఖ
IPL 2025, RCB vs GT: తడబడిన బెంగళూరు.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే