Home » Jagan
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినా విద్యార్థులకు అందించే వేరుశనగ చిక్కీ ప్యాకెట్లపై ఇంకా జగన్ నామ స్మరణ చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది.
రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించేందుకు వీలుగా గత జగన్ సర్కారు తీసుకువచ్చిన తరగతి గది ఆధారిత అంచనా పరీక్ష(సీబీఏ) విధానాన్ని హైకోర్టు కొట్టేసింది.
పోలవరం ప్రాజెక్టు విధ్వంసంపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై జగన్ సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నారు. పోలవరం ప్రస్తుత దుస్థితికి కర్త, కర్మ, క్రియ జగనేనని చంద్రబాబు విస్పష్టంగా ప్రకటించారు.
ముఖ్యమంత్రిగా జగన్ ముంచేసిన ప్రభుత్వ సంస్థల్లో విద్యుత్ రంగమే ముందు వరసలో ఉంటుంది. అటు వినియోగదారులను బాదేస్తూ, ఇటు విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టే స్తూ ఐదేళ్ల పాలనలో ఏపీకి కళా‘కాంతి’ లేకుండా చేశారు.
కాలం కంటే వేగంగా, కాలాన్ని వెనక్కి నెట్టి పనిచేసే కలెక్టర్లే కాదు... ‘కాలజ్ఞానం’ తెలిసిన కలెక్టర్లు కూడా ఉన్నారండోయ్..! పై నుంచి ఏ ఆదేశాలు వస్తాయో మూడు రోజులు ముందే ఊహించి అందుకనుగుణంగా పనిచేసేస్తారు..!
బందరు పోర్టు నిర్మాణం... రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ. 2008లో వైఎ్‌సఆర్ హయాంలో పోర్టుకు శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగలేదు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ప్రాజెక్టులో కదలిక తీసుకొచ్చారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోలవరం ప్రాజెక్టును పరిశీలించినప్పుడు.. అక్కడి పరిస్థితిని చూస్తే కన్నీళ్లు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
వైసీపీ పాలనలో సీఎం జగన్మోహన్రెడ్డి ఫొటోల పిచ్చి పతాక స్థాయికి చేరిన విషయం తెలిసిందే.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనానికి మునిసిపల్ అధికారులు నోటీసులు జారీచేశారు.
జగన్ జమానాలో చోటు చేసుకొన్న అధికార అరాచకాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం సీరియ్‌సగా దృష్టి పెట్టింది. గత ఐదేళ్లలో అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పుడు కేసులు పెట్టిన తీరు, ప్రతిపక్ష పార్టీల వారితో పాటు బడుగు బలహీన వర్గాలను....