YCP Political Tactics: తిట్టించు ఇరికించు
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:10 AM
వైసీపీ అధినేత జగన్ సొంత పార్టీ నేతలను, ప్రత్యర్థి పార్టీ నేతలను కేసుల్లో ఇరికించి రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆయన బూతులు తిట్టడం ద్వారా పార్టీ శ్రేణులను తన దగ్గర ఉంచుకోవాలని చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది

జగన్ రాజకీయ వ్యూహం ఇదే.. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే బలి
అసలేం జరిగింది?
జగన్ పరామర్శ పర్యటనపై పోలీసు దర్యాప్తు ప్రారంభం
‘విండ్ షీల్డ్’పై వాస్తవాల విచారణకు బెంగళూరుకు బృందం
జగన్ రెచ్చగొడుతున్న తీరుపై విచారణ జరపాలి
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఎంపీ లావు వినతి
అదంతా క్రిమినల్ లీడర్ ప్రీ ప్లాన్: హోం మంత్రి అనిత
విచారణ జరుగుతోందని, చర్చకు సిద్ధమని స్పష్టీకరణ
మళ్లీ మొదలెట్టిన వైసీపీ అధినేత
చంద్రబాబు, పవన్, లోకేశ్ సహా కూటమి నాయకులే టార్గెట్
సొంత నేతలను కేసుల్లో ఇరికించి వైసీపీని వీడకుండా వ్యూహం
గత ఐదేళ్లూ బూతుల దండకం
ఇప్పుడు మళ్లీ నోళ్లకు పని
పోలీసులపై స్వయంగా జగన్ తీవ్ర వ్యాఖ్యలు
టీడీపీ వాళ్లను నరికేస్తారన్న కారుమూరి
ఇదేబాటలో తోపుదుర్తి, లేళ్ల, పేర్ని నాని
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సొంత పార్టీ నేతలతో ప్రత్యర్థి పార్టీల నాయకులను బూతులు తిట్టించడం.. వాళ్లు కేసుల్లో ఇరుక్కునేలా ప్రేరేపించడం.. భవిష్యత్తులో మరో పార్టీలోకి వెళ్లే అవకాశం లేకుండా, తన దగ్గరే పడుండేలా చేయడం.. వైసీపీ అధినేత జగన్ మొదట్నుంచీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం. అధికారంలో ఉన్న గత ఐదేళ్లూ సొంత పార్టీకి చెందిన పలువురు నేతలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ సహా ప్రతిపక్ష నేతలను బండ బూతులు తిట్టించారు. ఇప్పుడు ఆ బూతుల నేతలు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించి 11 స్థానాలకే పరిమితం చేయడంతో కొన్ని నెలలు బూతులకు విరామం ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ జగన్ తన రాజకీయ వ్యూహం మొదలు పెట్టారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగేలా వైసీపీ కార్యకర్తల నుంచి ముఖ్యనేతల దాకా తాడేపల్లి ప్యాలెస్ తర్ఫీదు ఇస్తోంది. పార్టీ అధినేత జగన్ స్వయంగా అధికారులను, పోలీసులను బెదిరించేలా హెచ్చరికలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను టార్గెట్ చేసుకుని తాము అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టబోమని, బట్టలూడదీయిస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. పాలనా వ్యవస్థలపై జగన్ హెచ్చరికలు చేస్తుంటే, ప్రత్యర్థులపై దండయాత్ర చేస్తామంటూ ఆ పార్టీ మాజీ మంత్రులు రెచ్చిపోతున్నారు. టీడీపీ వాళ్లను నరికిపారేస్తారంటూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రెచ్చగొట్టేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఓ ఎస్‌ఐను బెదిరిస్తూ మాట్లాడారు. సీఎం చంద్రబాబు, పోలీసులపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని మళ్లీ నోరు విప్పుతున్నారు.
భవిష్యత్తుపై ఆందోళన
రాజకీయంగా స్తబ్ధుగా ఉన్న వైసీపీలో చలనం తీసుకువచ్చేందుకు బూతులను ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో జగన్ చేపట్టిన ప్రజాందోళనలకు జనం నుంచి స్పందన రాలేదు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేసిన పోరాటాలన్నీ విఫలమయ్యాయి. గత ఎన్నికల పరాజయం నుంచి కోలుకోకపోవడం, పార్టీ అధినేత తీరులో మార్పు రాకపోవడం వంటి కారణాలతో వైసీపీని పలువురు నేతలు వీడుతున్నారు.
జగన్ పెడుతున్న జిల్లాల సమావేశాలకు పార్టీ నేతల నుంచి స్పందన కరువవుతోంది. జిల్లా సమావేశాలకు చాలామంది నేతలు ముఖం చాటేస్తున్నారు. గతంలో మంత్రులుగా అధికారాన్ని అనుభవించిన వారు కూడా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయానికి రావడం మానేశారు. సకల శాఖల మంత్రిగా పేరున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో సహా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిత్యం మీడియా సమావేశాల్లో పెట్రేగిపోయిన నేతలు ఇప్పుడు కనిపించడం మానేశారు. దీంతో వైసీపీ భవిష్యత్తుపై జగన్‌లో ఆందోళన మొదలైంది. జిల్లాల పర్యటనలకు వెళ్తానని ప్రకటించిన జగన్ ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నారు. పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతుండటంతో కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం తెచ్చేందుకు రాజకీయ వ్యూహానికి పదును పెట్టారు.
పార్టీ శ్రేణులు చేజారకుండా..
గత ఎన్నికల్లో వైసీపీ ఘోరపరాజయం తర్వాత ఆ పార్టీ కీలక నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. పలువురు రాజ్యసభ, శాసన మండలి సభ్యులు పదవులకు, పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి దూరమయ్యారు. అధికారంలో ఉండగా ఎలాంటి లబ్ధి పొందని పార్టీ శ్రేణులు కూడా క్రమంగా వైసీపీకి దూరం కావడం మొదలెట్టాయి. వీటిని నివారించేందుకు కూటమి నేతలపైనా, అధికారులపైనా, పోలీసులపైనా యుద్ధం ప్రకటించేలా జగన్ రాజకీయ వ్యూహానికి తెరతీశారని చెబుతున్నారు. పార్టీ నేతలతో తిట్లదండకానికి మళ్లీ తెరలేపారని అంటున్నారు. బూతులు తిట్టించడం వల్ల నేతలు కేసులలో ఇరుక్కుంటారు. దీంతో వైసీపీకి దూరం కావాలన్న ఆలోచన రాదు. మరోవైపు దుర్భాషలాడిన నేతలను కూటమి కూడా దగ్గరకు తీసుకోదు. వైసీపీ నుంచి బయటకు వెళ్లేందుకు దారులు మూసుకుపోతాయి.ఇందుకోసం కూటమి నేతలను తిట్టించి, పార్టీ శ్రేణులు కేసుల్లో ఇరుక్కునేలా జగన్ రాజకీయ క్రీడ మొదలు పెట్టారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Read Latest AP News And Telugu News