Share News

Jagan : చంద్రబాబూ చర్యకు ప్రతిచర్య తప్పదు

ABN , Publish Date - Apr 11 , 2025 | 06:31 AM

చంద్రబాబు చర్యలకు తగిన ప్రతిచర్యలు ఉంటాయని వైఎస్ జగన్ హెచ్చరించారు. పోలీసులను దుర్వినియోగం చేస్తూ ప్రజల్లో భయం సృష్టిస్తున్నారని విమర్శించారు

Jagan : చంద్రబాబూ చర్యకు ప్రతిచర్య తప్పదు

  • ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో జగన్‌

అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): తాము అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసే చర్యలకు ప్రతి చర్యలు తప్పవని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. తాడేపల్లి ప్యాలె్‌సలో గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని జగన్‌ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం పోలీసులను వాచ్‌మెన్‌ల కంటే ఘోరంగా వాడుకుంటున్నదని ఆరోపించారు. చంద్రబాబు భయపెట్టే ప్రయత్నాలు చేస్తాడని పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - Apr 11 , 2025 | 06:31 AM