Home » Jharkhand
సభ వ్యవహారాలకు అడ్డుపడుతున్నారనే కారణంతో 18 మంది బీజేపీ(BJP) ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి రెండ్రోజులపాటు సస్పెండ్ చేశారు. సభ నుంచి బయటకి రావడానికి ఎమ్మెల్యేలు ససేమిరా అనడంతో మార్షల్స్ వారిని ఎత్తుకుని బయటకు పంపేశారు.
జార్ఖండ్‌లో ముంబయి- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.
హౌరా నుంచి ముంబయి వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో ఎక్స్ వేదికగా స్పందించారు.
మరో ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జార్ఖండ్‌లో సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలోని చక్రధర్పూర్ డివిజన్లో బడాబాంబూ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ముంబయి - హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 12 బోగీల్లో 10 పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వైద్య చికిత్స కోసం వారిని బబాబాంబూ ఆసుపత్రికి తరలించారని రైల్వే శాఖ వెల్లడించింది. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం వారందరిని చక్రధరపూర్‌కు పంపినట్లు తెలిపింది.
భూముల కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి జార్ఖండ్ సీఎం సొరేన్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు జూన్ 28న ఇచ్చిన బెయిల్ హేతుబద్ధమైందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఈడీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. ఈ సందర్బంగా హేమంత్ సోరెన్‌కు జార్ఖ్ండ్ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులోని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం సమర్థించింది.
శ్రావణ మాసంలో జరిగే కావడి యాత్ర సందర్భంగా భక్తులు వెళ్లే మార్గంలో ఉన్న హోటళ్లు, దాబాలు, తోపుడు బండ్ల ఎదుట వాటి యజమానులు సిబ్బంది సహా వ్యక్తిగత వివరాలను ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది.
గిరిజన ముఖ్యమంత్రిగా గిరిజనుల స్థితిగతులను పట్టించుకోవడానికి బదులు 'ల్యాండ్ జీహాద్', 'లవ్ జీహాద్'లను జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రోత్సహిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. దీంతో భూములు, జనాభా మధ్య సమతుల్యం దెబ్బతింటోందని చెప్పారు.
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సోమవారం ప్రఽధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోలను హేమంత్ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
జైలు నుంచి విడుదలయ్యాక జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(CM Hemanth Sorean) సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని తొలిసారి కలిశారు. సీఎం పదవి చేపట్టాక ప్రధానితో జరిగిన తొలి సమావేశం ఇది. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మోదీని కలవడం చర్చనీయాంశం అయింది.