Share News

Supreme Court : హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌ రద్దు చేయనక్కర్లేదు

ABN , Publish Date - Jul 30 , 2024 | 02:40 AM

భూముల కుంభకోణంలో మనీ లాండరింగ్‌ కేసులకు సంబంధించి జార్ఖండ్‌ సీఎం సొరేన్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు జూన్‌ 28న ఇచ్చిన బెయిల్‌ హేతుబద్ధమైందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Supreme Court : హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌ రద్దు చేయనక్కర్లేదు

న్యూఢిల్లీ, జూలై 29: భూముల కుంభకోణంలో మనీ లాండరింగ్‌ కేసులకు సంబంధించి జార్ఖండ్‌ సీఎం సొరేన్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు జూన్‌ 28న ఇచ్చిన బెయిల్‌ హేతుబద్ధమైందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనిని రద్దు చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. సొరేన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. ‘‘అత్యంత హేతుబద్ధమైన తీర్పు.

ఈ విషయంలో మేం జోక్యం చేసుకునేది లేదు’’ అని స్పష్టం చేసింది. బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తదుపరి విచారణ, చర్యలపై ఎలాంటి ప్రభావం చూపబోవని వ్యాఖ్యానించింది. ‘‘ఈ కేసులో ఇతర విషయాల జోలికి మేం వెళ్లడం లేదు. అలా వెళ్తే మీరే(ఈడీ) ఇబ్బందుల్లో పడతారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు సీఎం హేమంత్‌ సొరేన్‌ అన్నారు. ఈ తీర్పుతో ప్రజాస్వామ్యం నిలబడిందని తెలిపారు

Updated Date - Jul 30 , 2024 | 02:40 AM