Share News

Jharkhand: పట్టాలు తప్పిన మరో ఎక్స్‌ప్రెస్ రైలు.. ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు

ABN , Publish Date - Jul 30 , 2024 | 07:53 AM

మరో ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జార్ఖండ్‌లో సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలోని చక్రధర్‌పూర్ డివిజన్‌లో బడాబాంబూ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ముంబయి - హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 12 బోగీల్లో 10 పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వైద్య చికిత్స కోసం వారిని బబాబాంబూ ఆసుపత్రికి తరలించారని రైల్వే శాఖ వెల్లడించింది. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం వారందరిని చక్రధరపూర్‌కు పంపినట్లు తెలిపింది.

Jharkhand: పట్టాలు తప్పిన మరో ఎక్స్‌ప్రెస్ రైలు.. ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు

రాంచి, జులై 30: మరో ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జార్ఖండ్‌లో సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలోని చక్రధర్‌పూర్ డివిజన్‌లో బడాబాంబూ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ముంబయి - హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 12 బోగీల్లో 10 పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. 20 మందికిపైగా గాయపడ్డారు. వైద్య చికిత్స కోసం వారిని బబాబాంబూ ఆసుపత్రికి తరలించారని రైల్వే శాఖ వెల్లడించింది. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం వారందరిని చక్రధరపూర్‌కు పంపినట్లు తెలిపింది.


కొనసాగుతున్న సహాయక చర్యలు..

ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని... సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని వివరించింది. సహయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సౌత్ ఈస్ట్ రైల్వే డివిజన్‌లోని ఉన్నతాధికారి పేర్కొన్నారు.


ఈ రోజు తెల్లవారుజామున..

ముంబయి- హౌరా మెయిల్‌తోపాటు సరుకు రవాణా రైలు కూడా ప్రమాదానికి గురైందని తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ రైలు ప్రమాదం నేపథ్యంలో ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేశామని.. అలాగే మరికొన్ని రైళ్లను దారి మళ్లించామని తెలిపారు. ఈ రైలు ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ఈ రైలు ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో సాత్ ఈస్ట్ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లను విడుదల చేసింది. ఈ ప్రమాదంపై విచారణకు రైల్వే శాఖ ఆదేశించింది.


హెల్ప్ లైన్ నెంబర్లు..

Tatanagar : 06572290324

Chakradharpur: 06587 238072

Rourkela: 06612501072, 06612500244

Howrah: 9433357920, 03326382217

Ranchi: 0651-27-87115.

HWH Help Desk: 033-26382217, 9433357920

SHM Help Desk: 6295531471, 7595074427

KGP Help Desk: 03222-293764

CSMT Helpline Auto no 55993

P&T 022-22694040

Mumbai: 022-22694040

Nagpur: 7757912790


వరుస రైలు ప్రమాదాలు.. ప్రతిపక్షాలు విమర్శలు

ఇటీవల వరుసగా పలు రైలు పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనల్లో పలువురు మరణించారు. ఈ నేపథ్యంలో రైల్వే ప్రమాదాలపై ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తున్న విషయం విధితమే.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 30 , 2024 | 10:44 AM