Home » Kaleshwaram Project
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విచారణలో భాగంగా ఈనెల 16వ తేదీన జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్‌కు రానున్నారు. దాదాపు 20 రోజుల పాటు హైదరాబాద్‌లోనే మకాం వేసి, విచారణ ప్రక్రియను చేపట్టనున్నారు.
ప్రస్తుత ఖరీఫ్ (వానాకాలం) సీజన్లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 98,570 ఎకరాలకు సాగు నీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అదేశించారు. వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘో్‌షకు మూడు నెలలుగా జీతం చేతికి రాలేదు. ఆయన జీతభత్యాల ఫైలు ఆర్థిక శాఖలో ఆగిపోవడమే దీనికి కారణం.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నీరు నిల్వ చేయవద్దంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) స్పష్టం చేసిన సంగతి బీఆర్ఎస్ నేతలకు తెలియదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుల వైఫల్యంపై భూపాలపల్లి జిల్లా కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. బ్యారేజీలో జరిగిన నష్టంపై ప్రైవేటు పిటిషన్‌ను విచారించిన భూపాలపల్లి ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు తాఖీదులు జారీ చేసింది.
‘‘కాళేశ్వరం కట్టినప్పుడు.. కూలినప్పుడు అధికారంలో ఉన్నది కేసీఆర్ కుటుంబమే? కూలినప్పుడు కూడా వారే అధికారంలో ఉన్నారు. రీ-డిజైనింగ్, రీ-ఇంజనీరింగ్‌తోనే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ మళ్లీ అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) విమర్శించారు. కాళేశ్వరంపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. BRS చర్యల వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై గత కొన్నిరోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఢిల్లీ వెళ్లి అక్కడ వరుస సమీక్షలు, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్సఏ) చెబితేనే కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల్లో నీటిని నిల్వ చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.