Home » KCR
గ్రేటర్ హైదరాబాద్లో మూసి పక్కన ఉన్న పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు హామీ ఇచ్చారు. ముకేష్ అంబానీ తలుచుకుంటే మధ్యతరగతి వారు తీసుకున్న లోన్లు మాఫీ చేయొచ్చని అన్నారు.
Telangana: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ దీక్షకు కాంగ్రెస్కు భయం పట్టుకుందన్నారు.
తొమ్మిదేళ్లు తెలంగాణలో ప్రజా కంటగింపు పాలనను చూశామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. కేసీఆర్ ఇక అధికారంలోకి రాడని.. నేరుగా సీఎం రేవంత్రెడ్డి పేదల ఇళ్లను కూలుస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలను ఒకలా.. హిందువులను మరోలా చూస్తున్నారని ధ్వజమెత్తారు.హిందువుల ఇళ్లను మాత్రమే హైడ్రా కూలుస్తుందని ఎంపీ అరవింద్ ఆరోపించారు.
కేసీఆర్ అవినీతి లక్ష కోట్లను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి కక్కిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. నాడు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారని.. కానీ ఇప్పుడు సిట్టింగ్ జడ్జి దొరకలేదా? రిటైర్ అయిన జడ్జితో సిట్ వేశారని ఎద్దేవా చేశారు. రేవంత్ మూసీ సుందరీకరణ పేరిట కొత్త డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ భూసేకరణలో భారీగా అక్రమాలు జరిగాయని, కోట్లాది రూపాయల నిధులు పక్కదారి పట్టినట్లు వచ్చిన ఆరోపణలపై ఇంటెలిజెన్స్, సీఐడీ అధికారులు గోప్యంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టు ప్రజా వ్యతిరేకతకు గురి కాకముందే తాత్కాలికంగా పక్కన పెట్టాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సూచించారు.
ఎవరు ఊహించని స్థాయికి హైదరాబాద్ను అభివృద్ధి చేసుకున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెచ్చుకున్న తెలంగాణ ఏ ప్రాంతం వారికి మనోభావాలు దెబ్బతినకుండా పదేళ్లు పరిపాలించామని అన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవం కోసం, పోరాటాలు నడిపిన తొలితరం ఉద్యమ నేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి అజరామరమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు.
పదినెలల తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించిందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నామని.. ఇప్పటికైనా మిగిలిపోయిన ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్ఎస్ పార్టీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ వ్యవహారం ఎమ్మెల్యేల అరెస్టులకు దారితీసింది.